ఆల్టో 800 యానివర్స్‌రే ఎడిషన్ vs ఆల్టో కె10 మ్యూజిక్ ఎడిషన్
మారుతి సుజుకి అందిస్తున్న ఆల్టో సిరీస్ కార్లలో కంపెనీ రెండు స్పెషల్ ఎడిషన్లను ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టింది. అందులో ఒకటి ఆల్టో 800 యానివర్స్‌రే ఎడిషన్ మరొకటి ఆల్టో కె10 మ్యూజిక్ ఎడిషన్. కొత్త ఆల్టో 800ను భారత మార్కెట్లో విడుదల ఏడాది పూర్తయిన సందర్భంగా ఇందులో వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రవేశపెట్టగా, ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ఆల్టో కె10లో 'ఆల్టో కె10 మ్యూజిక్' అనే లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి విడుదల చేసింది.
ఈ రెండు లిమిటెడ్ ఎడిషన్ కార్లు కూడా, వాటి రెగ్యులర్ వెర్షన్లతో పోల్చుకుంటే మరిన్ని అధనపు ఫీచర్లు లభ్యమవుతాయి. యానివర్స్‌రే ఎడిషన్ ఆల్టో 800 కారు ప్రత్యేకమైన పర్పల్ హేజ్ బాడీ కలర్ స్కీమ్, ఆకర్షనీయమైన యానివర్స్‌రే బాడీ గ్రాఫిక్స్, కొత్త సీట్ కవర్ ఫ్యాబ్రిక్స్, బ్లాక్ కలర్ బి-పిల్లర్, కారుకు ఇరువైపులా స్క్రాచ్ గార్డ్స్, రియర్ పార్సిల్ ట్రే, బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్, ఆప్షనల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.3.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఆల్టో కె10 మ్యూజిక్ ఎడిషన్ కారు యూఎస్‌బి కనెక్టివిటీతో కూడిన జెవిసి ఎమ్‌పి3 ప్లేయర్, 4 ఇంచ్ ఫ్రంట్ స్పీకర్స్, స్పెషల్ బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ కవర్, ఆంబీంట్ లైటింగ్, మడ్ ఫ్లాప్స్, యూనివర్సల్ మ్యాట్స్, ఆల్టో కె10 మ్యూజిక్ డెకాల్ మరియు రియర్ స్పాయిలర్ వంటి అధనపు ఫీచర్లతో లభిస్తుంది. దీని ధర రెగ్యులర్ వెర్షన్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ వేరియంట్ల కన్నా రూ.10,000, రూ.15,000 అధనంగా ఉండొచ్చని సమాచారం. ఈ రెండు వేరియంట్లలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.

ఆల్టో 800 కారులో 796సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 46 హెచ్‌పిల శక్తిని, 69 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 22 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ఆల్టో కె10లో ఉపయోగించిన 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటర్ పెట్రోలుకు 20.92 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








