డిసి డిజైన్స్ నుంచి మరో సరికొత్త ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్
వెహికల్ కస్టమైజేషన్‌లో అత్యంత పాపులర్ అయిన ఇండియన్ కంపెనీ డిసి డిజైన్స్ ఇప్పటికే టొయోటా ఇన్నోవా కోసం అనేక లాంజ్ ప్యాకేజ్‌లను క్రియేట్ చేసిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా ఈ కస్టమైజేషన్ హౌస్ మరో ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్‌ను ప్రవేశపెట్టింది. బీజ్ అండ్ కాఫీ కలర్ ఇంటీయర్స్ థీమ్‌తో పాటుగా ప్రీమియం లెథర్ సీట్స్ మరియు ఫీచర్లతో ఈ ప్యాకేజ్‌ను కస్టమైజ్ చేశారు.
కస్టమర్లు తమకు నచ్చిన విధంగా టొయోటా ఇన్నోవాను మార్చుకునేందుకు వీలుగా కూడా కంపెనీ పలు ప్యాకేజ్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ కస్టమైజ్డ్ ఇన్నోవా ఇంటీరియర్లను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. అవేంటో చూద్దాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

డిసి ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ రూఫ్ సెంటర్ మాడ్యూల్ ఉంటుంది. ఇందులో ఇండివిడ్యువల్ రీడింగ్ లైట్స్ కూడా ఉంటాయి. డ్రైవర్‌కు ప్యాసింజర్లకు సంబంధం లేకుండా ప్రైవేట్ పార్టిషన్ కూడా ఉంటుంది.

ఈ ప్యాకేజ్‌లో భాగంగా ఫుల్లీ పవర్డ్ 24 ఇంచ్ కెప్టెన్ సీట్లను ఆఫర్ చేస్తున్నారు. ఈ సీట్లను పూర్తిగా యాంత్రికంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఈజీ స్లైడ్ ఇన్, స్లైడ్ అవుట్ కోసం ఇందులోని ఇంగ్రెస్/ఎగ్రెస్ సహకరిస్తుంది.

డిసి ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్‌లో 22 ఇంచ్ ఎల్ఈడి టివి, ఐ-పాడ్ రెడీ డివిడి ప్లేయర్, స్పీకర్స్, ఇంటర్‌కమ్, ఫ్రంట్ కెమెరా, రివర్స్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.

ఇందులోని డోర్ ప్యానెల్స్‌ని కూడా విలాసవంతంగా తీర్చిద్దారు. డోర్ హ్యాండిల్ లైటింగ్, ఎలక్ట్రానిక్ ఫంక్షన్ కీస్‌తో దీనిని డిజైన్ చేశారు. డిసి డిజైన్స్ ఈ కొత్త ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్ ధరను వెల్లడించలేదు. ఆసక్తి కలిగిన కస్టమర్లు సమీపంలోని డిసి షోరూమ్‌ని సంప్రదించి తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








