అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివి విడుదల; ధర రూ.7.50 లక్షలు
హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ తమ జపాన్ భాగస్వామి నిస్సాన్‌తో చేతులు కలిపి రూపొందించిన 'అశోక్ లేలాండ్ స్టైల్' (Ashok Leyland Stile) ఎమ్‌పివిని నేడు (అక్టోబర్ 7, 2013)న వాణిజ్య పరంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధర రూ.7.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
నిస్సాన్ ఇవాలియా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఈ కొత్త ఎమ్‌పివిని గడచిన జులై నెలలో అశోక్ లేలాండ్ ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇవాలియాకు రీబ్యాడ్జ్‌డ్ వెర్షనే ఈ స్టైల్ ఎమ్‌పివి. ఈ 7-సీటర్ ఎమ్‌పి మొత్తం వేరియంట్లలో లభిస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఇది కేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభ్యం కానుంది.
ఇందులో నిస్సాన్ నుంచి పాపులర్ అయిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 75 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 185 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, చెవర్లే ఎంజాయ్, నిస్సాన్ ఇవాలియా వంటి ఎమ్‌పివిలతో పోటీ పడనుంది.



Click it and Unblock the Notifications








