స్టైల్ ఎమ్‌పివిని ఆవిష్కరించిన అశోక్ లేలాండ్
అశోక్ లేలాండ్ తొలి బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) స్టైల్ విడుదల గురించి ఇదివరకటి కథనంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రకటించినట్లుగానే, కంపెనీ ఈ వాహనాన్ని మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ తమ జపాన్ భాగస్వామి నిస్సాన్‌తో చేతులు కలిపి రూపొందించిన 'అశోక్ లేలాండ్ స్టైల్' (Ashok Leyland Stile) ఎమ్‌పివిని కంపెనీ ఛైర్మన్ ధీరజ్ జి హిందూజా చెన్నైలో ఆవిష్కరించారు.
నిస్సాన్ ఇండియా అందిస్తున్న ఇవాలియా ఎమ్‌పివి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివిని అభివృద్ధి చేశారు. చెన్నైలో ఉన్న నిస్సాన్ ప్లాంటులోనే స్టైల్ ఎమ్‌పివిని కూడా ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్‌లో తమ స్టైల్ ఎమ్‌పివిని వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది. అయితే, దీని ధర మరియు ఇతర సాంకేతిక వివరాలను మాత్రం అశోక్ లేలాండ్ వెల్లడించలేదు.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, నిస్సాన్ ఇవాలియా ధర కన్నా అశోక్ లేలాండ్ స్టైల్ ధర సుమారు రూ.50,000 వరకు తక్కువగా ఉండొచ్చని అంచనా. నిస్సాన్‌తో కలిసి అశోక్ లేలాండ్ ఇప్పటికే అందిస్తున్న తేలికపాటి వాణిజ్య వాహనం దోస్త్ ఎల్‌సివి ప్లాట్‌ఫామ్‌పై ఓ ప్యాసింజర్ క్యారీయర్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

స్టైల్ ఎమ్‌పివిని ఆవిష్కరిస్తున్న అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ జి హిందూజా, నిస్సాన్ ఇండియా హెడ్ కార్లోస్ ఘోస్న్

అశోక్ లేలాండ్ స్టైల్ ఆవిష్కరణ సందర్భంగా మీడియాకు ఫోజిలిస్తున్న ఇరు కంపెనీల అధినేతలు.

నిస్సాన్ అందిస్తున్న ఇవాలియా ఎమ్‌పివి ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని స్టైల్ ఎమ్‌పివిని అభివృద్ధి చేశారు. దీనిని కూడా చెన్నైలోని నిస్సాన్ ప్లాంటులోనే ఉత్పత్తి చేయనున్నారు.

నిస్సాన్ కంపెనీతో అశోక్ లేలాండ్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఉత్పత్తిని తయారు చేశారు. త్వరలోనే దోస్త్ ఎల్‌సివి ప్లాట్‌ఫామ్‌పై ఓ సరికొత్త ప్యాసింజర్ క్యారీయర్ వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాని కంపెనీ పేర్కొంది.

ఈ ఏడాది పండుగ సీజన్‌లో అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివిని వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ తెలిపింది.
నిస్సాన్ ఇవాలియా, అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివిల బేసిక్ డిజైన్‌లు ఒక్కటిగానే ఉన్నప్పటికీ, ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివిలో ఉపయోగించిన ఇంజన్‌నే అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు.
నిస్సాన్ నుంచి పాపులర్ అయిన 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివిలో ఉపయోగించనున్నారు. ఇది 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన అశోక్ లేలాండ్ స్టైల్ లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








