లేటెస్ట్ దుబాయ్ పోలీస్ కార్ 'ఆస్టన్ మార్టిన్ వన్-77'
దుబాయ్ పోలీసులకు ఇప్పుడు సూపర్ కార్ల ఫీవర్ పట్టుకుంది. ఇటీవలే లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్ కారును తమ అధికారిక వాహనంగా చేర్చుకున్న దుబాయ్ పోలీసులు తాజాగా బ్రిటీష్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న వన్-77 కారును తమ అధికారిక పోలీస్ కారుగా మార్చుకున్నారు. దుబాయ్ పోలీసుల వద్ద ఇప్పటికే ఫెరారీ ఎఫ్ఎఫ్, చెవర్లే కమారో వంటి సూపర్ కార్లు కూడా ఉన్నాయి. వన్-77 సూపర్ కారు ఆస్టన్ మార్టిన్ నుంచి లభిస్తున్న కార్లలో కెల్లా అత్యంత ఖరీదైనది.
ఆస్టన్ మార్టిన్ ఇలాంటి కార్లను కేవలం 77 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. అందుకే ఈ కారుకు వన్-77 అనే పేరును పెట్టారు. వాస్తవానికి ఈ కార్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ప్రస్తుతం దుబాయ్ పోలీసులు ఉపయోగిస్తున్న ఈ కారును ఎవరైనా బహుమతిగా ఇచ్చి ఉంటారా లేదా సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలుచేసి ఉంటారా అనే విషయం మాత్రం తెలియరాలేదు.
ఆస్టన్ మార్టిన్ వన్-77 కారును తొలిసారిగా 2009లో జరిగిన జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించారు. ఆస్టన్ మార్టిన్ వన్-77 కారులో ఉపయోగించిన 7.3 లీటర్ వి12 ఇంజన్ గరిష్టంగా 750 బిహెచ్‌పిల శక్తిని, 750 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. వన్-77 కారు బరువును తక్కువగా ఉంచేందుకు గాను దీని బాడీని లైట్‌వెయిట్ హ్యాండ్‌మేడ్ అల్యూమినియం ప్యానెల్స్‌తోనూ, కార్బన్ ఫైబర్‌తోనూ రూపొందించారు.

ఆస్టన్ మార్టిన్ వన్-77

ఆస్టన్ మార్టిన్ వన్-77

ఆస్టన్ మార్టిన్ వన్-77

ఆస్టన్ మార్టిన్ వన్-77

ఆస్టన్ మార్టిన్ వన్-77



Click it and Unblock the Notifications








