ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల
బ్రిటన్‌కు చెందిన ఆల్ట్రా లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ మరో సరికొత్త సూపర్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫోర్ డోర్ వెర్షన్ 'ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ ఎస్' (Aston Martin Rapide S) మోడల్‌ను కోయంబత్తూర్‌లో ఆవిష్కరించారు.
ఇదివరకు కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ 'ర్యాపిడ్' మోడల్ స్థానాన్ని భర్తీ చేస్తూ, ఈ కొత్త 'ర్యాపిడ్ ఎస్'ను మోడల్‌ను ప్రవేశపెట్టారు. భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ ఎస్ స్పోర్ట్స్ కారు ధర రూ.4.4 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న ఆస్టన్ మార్టిన్, ఈ స్పోర్ట్స్ కారు కోసం ప్రతి ప్రాంతం నుంచి 10 నుంచి 15 మంది కస్టమర్లను టార్గెట్ చేసుకుంటోంది. కోయంబత్తూర్, తిరుపూర్‌లలోని కస్టమర్ల కోసం ఆస్టన్ మార్టిన్ తమ సరికొత్త ర్యాపిడ్ ఎస్ కారుతో పాటుగా వ్యాంటేజ్ కారును కూడా ప్రదర్శనకు ఉంచింది.
ఆస్టన్ మార్టిన్ 2011లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 55 కార్లను విక్రయించింది. రానున్న సంవత్సరంలో కేవలం దక్షిణ భారతదేశం నుంచే కనీసం 20 కార్లు అమ్ముడుపోతాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications








