బెంగుళూరులో ఆడి ఏ3 కన్వర్టిబల్ విడుదల, కొత్త షోరూమ్

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, బెంగురుళూరులో తమ సరికొత్త సెంట్రల్ షోరూమ్‌ను ప్రారంభించింది. విశిష్టమైన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని ఇప్పటికే ఢిల్లీలో నిర్వహిస్తున్న 'ఆడి ఢిల్లీ సెంట్రల్' మాదిరిగానే కర్ణాటలో 'ఆడి బెంగుళూరు సెంట్రల్' పేరిట ఓ కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది.

ఆడి ఇండియా బెంగుళూరులో తమ రెండవ షోరూమ్‌ను ఏర్పాటు చేయటంతో పాటుగా గడచిన డిసెంబర్ నెలలో దేశీయ విపణిలో విడుదల చేసిన కన్వర్టిబల్ వెర్షన్ ఆడి ఏ3 కారును తాజాగా కర్ణాటక మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడి ఏ3 క్యాబ్రియో అని పిలువబడే ఈ కారు ఒకే ఒక్క వేరియంట్‌లో, అందులోను పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.

మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

బెంగుళూరులో ఆడి ఏ3 క్యాబ్రియో

బెంగుళూరులోని నెం.1 విట్టల్ మాల్యా రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఆడి బెంగుళూరు సెంట్రల్ షోరూమ్ 7800 చ.అ. విస్తీర్ణాన్ని కలిగి ఉండి, 8 కార్లను ప్రదర్శించేందుకు వీలుగా ఉంటుంది.

బెంగుళూరులో ఆడి ఏ3 క్యాబ్రియో

ఈ షోరూమ్ ప్రారంభం కోసం ఆడి ఇండియా హెడ్ జో కింగ్, ప్రముఖ బాలీవుడ్ నటి గుల్ పనాగ్, ప్రమఖ అంతర్జాతీయ రేసర్ అదిత్యా పటేల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

బెంగుళూరులో ఆడి ఏ3 క్యాబ్రియో

ఆడి ఇండియా తమ ఏ3 క్యాబ్రియో మోడల్‌ను తొలిసారిగా 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఈ మోడల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకి దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.

ఇంజన్, ట్రాన్సిమిషన్:

ఇంజన్, ట్రాన్సిమిషన్:

ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో 1.8 లీటర్, టర్బోచార్జింగ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 180 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ ఎస్-ట్రానిక్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్:

పెర్ఫార్మెన్స్:

ఆడి ఏ3 కన్వర్టిబల్ కారు కేవలం 7.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 242 కిలోమీటర్లు.

ఆటోమేటిక్ కన్వర్టిబల్ రూఫ్:

ఆటోమేటిక్ కన్వర్టిబల్ రూఫ్:

ఆడి ఏ3 క్యాబ్రియో ఓ 4-సీటర్ కన్వర్టిబల్ కారు. ఇందులో ఫ్యాబ్రిక్‌తో చేసిన సాఫ్ట్ టాప్ రూఫ్ ఉంటుంది. ఇది గంటకు 50 కిలోమీటర్ల వేగం వరకూ కూడా కేవలం 18 సెకండ్ల వ్యవధిలోనే ఓపెన్ అవుతుంది. ఇది ఎలక్ట్రో హైడ్రాలిక్ మెకానిజం ద్వారా పనిచేస్తుంది.

ఫీచర్లు:

ఫీచర్లు:

ఈ కారులో 7-ఇంచ్ ఎమ్ఎమ్ఐ టచ్‌స్క్రీన్, నావిగేషన్, ఆడి సౌండ్ సిస్టమ్, డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ విత్ సన్ సెన్సార్, ఆడి టిటి నుంచి స్ఫూర్తి పొంది టర్బైన్ ఎయిర్ వెంట్స్, లైట్ అండ్ రెయిన్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ వంటి కీల ఫీచర్లున్నాయి.

సీటింగ్, లగేజ్ స్పేస్:

సీటింగ్, లగేజ్ స్పేస్:

ఈ కన్వర్టిబల్ కారు 4421 మి.మీ. పొడవును కలిగి ఉంటుంది. ఇందులో నలుగు ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇందులో 320 లీటర్ల లగేజ్ స్పేస్ కూడా ఉంటుంది.

కస్టమైజేషన్ ఆప్షన్స్

కస్టమైజేషన్ ఆప్షన్స్

ఆడి ఏ3 క్యాబ్రియో కారు కోసం ఆడి ఇండియా అనేక కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఎక్స్టీరియర్ కలర్, ఇంటీరియర్ లెథర్, ఆడియో సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన వాటిని కస్టమర్లు తమకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేయించుకోవచ్చు.

ధర:

ధర:

బెంగరుళూరు మార్కెట్లో 'ఆడి ఏ3 క్యాబ్రియో' ధరను రూ.45.83 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా నిర్ణయించారు.

More from DriveSpark

Article Published On: Saturday, January 24, 2015, 9:14 [IST]
English summary
The Audi A3 Cabriolet was officially launched today in Bangalore. The new car is the first convertible in the category and one of the few open-top vehicles available in the country presently. Audi also celebrated the opening of their second showroom in Bangalore at the same event, with the glamorous Gul Panag and international racer Aditya Patel present at the occasion.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+