2014 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 'ఆడి ఏ3'
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి తయారు చేస్తున్న 'ఆడి ఏ3' మిడ్-సైజ్ లగ్జరీ సెడాన్ ఇప్పుడు '2014 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆడి ఏ3 కారుకు ఈ సర్టిఫికెట్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఐఐహెచ్ఎస్ క్రాష్ టెస్ట్‌లో టాప్ రేటింగ్ పొందిన ఆడి ఏ3
ఆడి ఏ3 కేవలం సెలూన్, స్పోర్ట్‌బ్యాక్, కాబ్రియోలెట్ మరియు త్రీ డోర్ ఆప్షన్లతో కూడా లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 3వ తరానికి చెందిన ఆడి ఏ3 సెడాన్. ఇందులో అన్ని బాడీ స్టైల్స్ కోసం కంపెనీ 'ఎస్' అనే స్పోర్టీ ఆప్షన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

ఇటీవలే యూఎస్ ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైవే సేఫ్టీ (ఐఐహెచ్ఎస్) నిర్వహించిన క్రాష్ టెస్టులో ఆడి ఏ3 సెడాన్ టాప్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ క్రాష్ టెస్టులో 2015 ఆడి ఏ3 సెడాన్ టాప్ సేఫ్టీ పిక్ ప్లస్ పేరును సొంతం చేసుకుంది. ఇది ఐఐహెచ్ఎస్ అందిస్తున్న అత్యధిక సేఫ్టీ రేటింగ్ కావటం విశేషం.
ఆడి ఏ3 సెడాన్ త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. 2014 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కోసం మొత్తం 23 కార్లు పోటీ పడ్డాయి. ఈ అవార్డును ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలకు చెందిన 63 మంది ప్రముఖ ఆటోమోటివ్ జర్నలిస్టులతో కూడిన జ్యూరీ ప్యానెల్ ప్రకటించింది.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఓ ఆడి కారు గెలుచుకోవటం ఇది రెండవసారి. గడచిన 10 ఏళ్ల క్రితం ఆడి ఏ6 ఈ అవార్డును సొంతం చేసుకోగా, మళ్లీ ఆడి ఏ3 ద్వారా కంపెనీ ఈ అవార్డును రెండోసారి కైవసం చేసుకోగలిగింది.


Click it and Unblock the Notifications








