హైదరాబాద్ మార్కెట్లో ఆడి ఏ3 సెడాన్ విడుదల
హైదరాబాద్: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ 'ఆడి ఏ3' (Audi A3)ని నేడు (ఆగస్ట్ 9, 2014) రాష్ట్ర మార్కెట్లో కూడా విడుదల చేసింది. విపణిలో ఆడి ఏ3 ప్రారంభ ధర రూ.22.95 లక్షలు (బేస్ డీజిల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.
ఇది కూడా చదవండి: ఆడి ఏ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ
కొత్త ఆడి ఏ3 సెడాన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 1.8 లీటర్, టిఎఫ్ఎస్ఐ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 177.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. మరొకటి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 141 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

పెట్రోల్ వెర్షన్ కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కాగా డీజిల్ వెర్షన్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. తర్వాతి స్లైడ్‌లలో ఆడి 3 సెడాన్ వేరియంట్లు, ధరలు పరిశీలించండి.

డీజిల్ వెర్షన్ ధరలు:
* ఆడి ఏ3 35టిడిఐ అట్రాక్షన్ - రూ.22.95 లక్షలు
* ఆడి ఏ3 35టిడిఐ ప్రీమియం - రూ.25.95 లక్షలు
* ఆడి ఏ3 35టిడిఐ ప్రీమియం ప్లస్ - రూ.29.95 లక్షలు
* ఆడి ఏ3 35టిడిఐ టెక్నాలజీ - రూ.32.66 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

పెట్రోల్ వెర్షన్ ధరలు:
* ఆడి ఏ3 40టిఎఫ్ఎస్ఐ ప్రీమియం ప్లస్ - రూ.28.95 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

ఇది కూడా చదవండి: ఆడి ఏ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ


Click it and Unblock the Notifications








