ఆడి ఏ3 సెడాన్ ప్రారంభ ధర రూ.26 లక్షలు ఉండొచ్చు!
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా మరికొద్ది రోజుల్లో దేశీయ విపణిలో తమ ఏ3 సెడాన్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో, ఈ కాంపాక్ట్ సెడాన్‌కు సంబంధించిన ధర ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. ఆగస్టు 2014లో విడుదల కానున్న ఆడి ఏ3 ప్రారంభ ధర రూ.26 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని అంచనా. ఈ మోడల్‌ను స్థానికంగా భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేయనున్నారు.
ఆడి ఏ3 ధరను అందుబాటులో ఉంచేందుకు గాను, బేస్ వేరియంట్లో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, లెథర్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లను తొలగించవచ్చు. అయితే, టాప్ వేరియంట్లో మాత్రం ఆడి లగ్జరీని ప్రతిభింభింపజేసేలా అల్లాయ్ వీల్స్, లెథర్ ఇంటీరియర్స్ వంటి ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది.
భారత్‌లో ఆడి ఏ3 అసెంబ్లింగ్ ఈనెలలో ప్రారంభం కానుంది, డెలివరీలు మాత్రం ఈ కారు మార్కెట్లో విడులైన తర్వాత (ఆగస్టులో) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ స్లీక్ అండ్ కాంపాక్ట్ ఆడి ఏ3 కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో (పెట్రోల్, డీజిల్) లభ్యం కానుంది.

ఇందులో 1.8 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 180 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గ్రేట్ న్యూస్ ఏంటంటే, ఆడి ఏ3 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఇందులో ఎస్-ట్రానిక్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








