ఆగస్ట్ 7, 2014న ఆడి ఏ3 సెడాన్ విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా నుంచి రానున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ ఆడి ఏ3 విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ఆడి ఇండియా ఈ కారును వచ్చే నెలలోనే విడుదల చేయనుంది. ఆగస్ట్ 7, 2014వ తేదీన ఈ కారును మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువస్తామని మీడియా టెస్ట్ డ్రైవ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది.

దేశీయ విపణిలో ఆడి ఏ3 ప్రారంభ ధర రూ.26 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని అంచనా. ఈ మోడల్‌ను స్థానికంగా భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేయనున్నారు. దీని ధరను అందుబాటులో ఉంచేందుకు గాను, బేస్ వేరియంట్లో ఎల్ఈడి హెడ్‌‌ల్యాంప్స్, లెథర్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లను తొలగించవచ్చు. అయితే, టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రం ఆడి లగ్జరీని ప్రతిభింభింపజేసేలా అల్లాయ్ వీల్స్, లెథర్ ఇంటీరియర్స్ వంటి ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

Audi A3

భారత్‌లో ఆడి ఏ3 అసెంబ్లింగ్ ఈనెలలో ప్రారంభం కానుంది, డెలివరీలు మాత్రం ఈ కారు మార్కెట్లో విడులైన తర్వాత (ఆగస్టులో) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ స్లీక్ అండ్ కాంపాక్ట్ ఆడి ఏ3 కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో (పెట్రోల్, డీజిల్) లభ్యం కానుంది. ఇందులో 1.8 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 180 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గ్రేట్ న్యూస్ ఏంటంటే, ఆడి ఏ3 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఇందులో ఎస్-ట్రానిక్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, July 12, 2014, 9:10 [IST]
English summary
German luxury carmaker Audi will launch the A3 sedan in India on 7th August 2014. The latest offering from the Audi stables will be locally assembled and their most affordable car. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+