ఆడి ఏ4 సెలబ్రేషన్ ఎడిషన్ విడుదల; ధర రూ.26 లక్షలు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న చీప్ అండ్ బెస్ట్ లగ్జరీ సెడాన్ 'ఆడి ఏ4'లో కంపెనీ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. 'ఆడి ఏ4 సెలబ్రేషన్ ఎడిషన్' (Audi A4 Celebration Edition) పేరిట విడుదలైన ఈ కొత్త వేరియంట్ కేవలం రూ.25.99 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్) లభ్యం కానుంది.
ఆడి ఏ4 సెలబ్రేషన్ ఎడిషన్ ధర స్టాండర్డ్ ఏ4 ధర కన్నా (సుమారు రూ.2.5 లక్షలు) తక్కువ. అయితే, స్డాండర్డ్ ఏ4తో పోల్చుకుంటే ఈ సెలబ్రేషన్ ఎడిషన్ ఏ4 కొన్ని ఫీచర్లను కోల్పోనుంది. సన్‌రూఫ్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, డ్యాష్‌బోర్డ్‌పై ఉడ్ ట్రిమ్ వంటి ఫీచర్లు ఇందులో మాయం కానున్నాయి.

అంతేకాకుండా, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఎలక్ట్రికానిక్ అడ్జస్ట్‌మెంట్‌ను కూడా తొలగించారు. ఇక ఇంజన్ విషయానికి వస్తే, సెలబ్రేషన్ ఎడిషన్ ఆడి ఏ4 కారులో లోవర్ పవర్డ్ వెర్షన్ అయిన 2.0 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఆడి ఏ4 సెలబ్రేషన్ ఎడిషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








