స్పెషల్ ఎడిషన్ ఏ6 సెడాన్‌ను విడుదల చేసిన ఆడి
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న లగ్జరీ కారు 'ఆడి ఏ6'లో స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశంలో మొత్తం 6,000 ఆడి ఏ6 కార్లు అమ్ముడుపోయిన నేపథ్యంలో, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ ఇందులో మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఓ స్పెషల్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
కీలెస్ ఎంట్రీ, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎమ్ఎమ్ఐ టచ్‌ప్యాడ్, అడ్జస్టబల్ ఎయిర్ సస్పెన్షన్, బోస్ మ్యూజిక్ సిస్టమ్, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అదనపు ఫీచర్లు ఈ స్పెషల్ ఎడిషన్ ఆడి ఏ6లో లభ్యం కానున్నాయి. అంతేకాకుండా, ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఆడి ఇండియా ఇటీవల ప్రవేశపెట్టిన ఆడి ఏ8 కారులో, వెనుక సీట్లలో ఆఫర్ చేస్తున్న ఓ ఫీచర్ కూడా ఉండనుంది.
ఆడి ఏ8 కారు వెనుక సీట్లలో కూర్చున ప్రయాణికుల సౌకర్యార్థం లెగ్‌రూమ్‌ను పెంచుకునేందుకు వెనుక వైపు నుంచే ముందు వైపు ఉన్న సీట్లను కంట్రోల్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను ఆడి ఏ6 స్పెషల్ ఎడిషన్ కారులో అందిస్తున్నారు. అంతేకాకుండా, వెనుక వైపు సీట్లలో కూర్చునే ప్రయాణికులు ఎమ్ఎమ్ సిస్టమ్‌ను యాక్సెస్ చేసేందుకు గాను రిమోట్ కంట్రోల్ సదుపాయాన్ని కూడా కల్పించారు.
ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఈ స్పెషల్ ఆడి ఏ6 హైడ్‌లైట్లతో పాటుగా అన్నీ ఎల్ఈడి లైట్లనే అమర్చారు. భారత మార్కెట్లో ఈ స్పెషల్ ఎఢిషన్ ఆడి ఏ6 (2.0 టిడిఐ ప్రీమియం ప్లస్ వేరియంట్) లగ్జరీ కారు ధర రూ.46.33 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.



Click it and Unblock the Notifications








