ఆడి ఏ4 ప్రీమియం స్పోర్ట్ వేరియంట్ విడుదల; ధర రూ.39.95 లక్షలు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఏ4 మోడల్‌లో కంపెనీ మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 'ఆడి ఏ4 ప్రీమియం స్పోర్ట్'గా పిలిచే ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఏ4 టెక్నాలజీకి దిగువన మరియు ఏ4 ప్రీమియం వేరియంట్‌కి ఎగువన ప్రవేశ పెట్టనున్నారు.
దేశీయ విపణిలో ఆడి ఏ4 ప్రీమియం స్పోర్ట్ వేరియంట్ ధర రూ.39.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

ఈ కొత్త వేరియంట్ ఆడి ఏ4 2.0 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 177 బిహెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ మిడ్-స్పెక్ వేరియంట్‌లో కొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. రీడిజైన్డ్ బంపర్స్, 20-స్పోక్ 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రెండు కొత్త పెయింట్ షేడ్స్ (వైట్, రెడ్)తో ఇది లభ్యం కానుంది.

దీని ఇంటీరియర్‌లో కూడా మార్పులు ఉన్నాయి. ఈ వేరియంట్‌లో ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్, కార్బన్ బ్లాక్ ప్యాకేజ్ (బ్లాక్ కలర్ డోర్ మౌల్డింగ్, విండో సిల్స్, వింగ్ మిర్రర్స్)ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఆడి ఏ4 ప్రీమియం స్పోర్ట్ ఈ సెగ్మెంట్లో త్వరలో విడుదల కానున్న సరికొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








