స్పెషల్ ఎడిషన్ ఆడి ఏ6ను విడుదల చేసిన ఆడి ఇండియా
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా అందిస్తున్న లగ్జరీ సెడాన్ 'ఆడి ఏ6' సెడాన్‌లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఆడి ఇండియా తమ ఏ6 సెడాన్ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ 6,000 యూనిట్లకు పైగా కార్లను విక్రయించింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్‌ను అందిస్తున్నామని, దీని ధర రూ.46.33 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గడచిన ఆరేళ్ల క్రితం ఆడి ఇండియా భారత మార్కెట్లో తమ ఏ6 సెడాన్‌ను విడుదల చేసింది. ఈ ఆరేళ్ల కాలంలో 6,000 యూనిట్ల ఆడి ఏ6 కార్లను కంపెనీ విక్రయించింది. తాజాగా ఆడి ఇండియా అందిస్తున్న స్పెషల్ ఎడిషన్ ఆడి ఏ6 కారులో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, 4-జోన్ డీలక్స్ ఎయిర్ కండిషనింగ్, రియర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, బాష్ ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, టచ్ అండ్ రిమోట్ కంట్రోల్‌తో కూడిన ఎమ్ఎమ్ఐ, ఎల్ఈడి హెడ్‌లైట్స్ మొదలైన ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తుంది.
అంతేకాకుండా, వెనుక వైపు నుంచి సర్దుబాటు చేసుకునే ముందువైపు ప్యాసింజర్ సీట్ (కో-డ్రైవర్ సీట్)ను జోడించారు. చైనాలో విక్రయిస్తున్న ఆడి ఏ6ఎల్ సెడాన్ నుంచి ఈ ఫీచర్‌ను గ్రహించారు. ఈ స్పెషల్ ఎడిషన్ ఆడి ఏ6 సెడాన్ రెండు ఇంజన్ ఆప్షన్లతో (2.0 టిడిఐ, 3.0 టిడిఐ) లభ్యమవుతుంది.



Click it and Unblock the Notifications








