ఆడి స్ప్రింగ్ కలెక్షన్: కార్లపై భారీ డిస్కౌంట్స్!
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా అందిస్తున్న విలాసవంతమైన కార్లను సొంతం చేసుకునేందుకు ఇదే అనువైన సమయం. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఆడి ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది.
కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఎక్సైజ్ రాయితీలపై ఇచ్చిన తగ్గింపు వలన వచ్చే సాధారణ ధర తగ్గింపు కాకుండా, ఆడి ఇండియా తమ కార్లపై అదనంగా 'స్ప్రింగ్ కలెక్షన్' పేరిట ప్రత్యేత తగ్గింపులను కూడా అందిస్తోంది.
ఆడి స్ప్రింగ్ కలెక్షన్‌లో భాగంగా.. మొత్తం 275 యూనిట్లు మాత్రమే ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ5 మరియు ఆడి క్యూ7 కార్లు ప్రత్యేక తగ్గింపు ధరలతో లభ్యం కానున్నాయి. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే. ముందుగా వచ్చిన బుకింగ్‌లకే ఈ అవకాశం ఉంటుంది.

ఆడి స్ప్రింగ్ కలెక్షన్‌లో భాగంగా, కంపెనీ ఈ నాలుగు మోడళ్లపై రూ.4.5 లక్షల నుంచి రూ.8.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. తాజా ధరల తగ్గింపు అనంతరం ఈ మోడళ్ల ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
* ఆడి ఏ4 2.0 డీజిల్ - రూ.28.30 లక్షలు
* ఆడి ఏ6 2.0 డీజిల్ - రూ.36.07 లక్షలు
* ఆడి క్యూ5 2.0 డీజిల్ - రూ.37.22 లక్షలు
* ఆడి క్యూ7 3.0 డీజిల్ - రూ.56.47 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








