సరికొత్త సూపర్ స్పోర్ట్స్ కారు ఆర్8ను విడుదల చేసిన ఆడి
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న సూపర్ స్పోర్ట్స్ కార్ ఆడి ఆర్8లో మరొక సరికొత్త వెర్షన్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హై పెర్ఫామెన్స్ సూపర్ స్పోర్ట్స్ కారులో కొత్తగా అభివృద్ధి చేసిన 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఇది 4.2 లీటర్ వీ8, 5.1 లీటర్ వీ10 ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఆడి ఆర్8 వి8 కూపే గరిష్టంగా 430 హెచ్‌పిల శక్తిని, 430 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.
అలాగే, ఆడి ఆర్8 వి10 కూపే గరిష్టంగా 525 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.6 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 314 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఆడి ఆర్8 వి10 స్పైడర్ కేవలం 3.8 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని, గరిష్టంగా గంటకు 311 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ మూడు వేరియంట్లు కూడా 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటాయి. దేశీయ విపణిలో ఈ మూడు వేరియంట్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి:
- ఆడి వి8 కూపే ధర - రూ.1.35 కోట్లు
- ఆడి వి10 కూపే ధర - రూ.1.57 కోట్లు
- ఆడి వి10 స్పైడర్ ధర - రూ.1.73 కోట్లు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఆడి ఆర్8

ఆడి ఆర్8

ఆడి ఆర్8

ఆడి ఆర్8

ఆడి ఆర్8

ఆడి ఆర్8

ఆడి ఆర్8

ఆడి ఆర్8

ఆడి ఆర్8

ఆడి ఆర్8

ఆడి ఆర్8



Click it and Unblock the Notifications








