ఆడి క్యూ3 ఎస్ విడుదల; ధర రూ.24.99 లక్షలు
చవక ఆడి క్యూ3 గురించి గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ విభిన్న కథనాల్లో ప్రచురించినట్లుగానే, జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు 'ఆడి క్యూ3 ఎస్' (Audi Q3 S)ను నేడు (ఆగస్ట్ 19, 2013) భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఆడి క్యూ3 ఎస్ ధర రూ.24.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ఆడి క్యూ3 ఎస్ ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నుంచి కొత్తగా మార్కెట్లోకి రానున్న బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ (సెప్టెంబర్ 3న విడుదల కానుంది) వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లకు పోటీగా నిలువనుంది. ఈ కారును సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్ రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేయనున్నారు.




Click it and Unblock the Notifications








