బెంగుళూరులో ఆడి క్యూ డ్రైవ్ ఎక్స్‌పీరెయన్స్ - డిటేల్స్
ఆడి ఇండియా అందిస్తున్న పవర్‌ఫుల్ కార్ల యొక్క ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను ప్రజలకు తెలియజేసేందుకు కంపెనీ, ప్రతి ఏటా క్యూ-డ్రైవ్ పేరిట ఓ ప్రత్యేక ఆఫ్-రోడింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది మూడవ ఎడిషన్ ఆడి క్యూ-డ్రైవ్ కార్యక్రమాన్ని బెంగుళూరులో నిర్వహించారు. మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కవర్ చేసింది. ఆ వివరాలను తెలుసుకుందాం రండి.
ఆడి క్యూ-డ్రైవ్ కాంటెస్ట్‌ను దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రధాన నగరాల్లో నిర్వహిస్తారు. ఈ ఏడాది సుమారు 6000 మందికి పైగా ఔత్సాహికులు ఇందులో పాల్గొంటారని అంచనా. ఆడి ఆఫర్ చేస్తున్న క్యూ3, క్యూ5 మరియు క్యూ7 ఎస్‌యూవీల యొక్క ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ ఫంక్షన్ వంటి అనేక ఆఫ్-రోడింగ్ ఫీచర్లతో లభిస్తాయి. ఈ ఈవెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బెంగుళూరులో నిర్వహించిన ఆడి క్యూ-డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా, ఒక క్యూ3, రెండు క్యూ5 మరియు ఒక క్యూ7 ఎస్‌యూవీలను డ్రైవింగ్ కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో పాల్గొన్న వారికి విభిన్న ఆడి ఎస్‌యూవీలను నడిపే అవకాశం ఏర్పడింది.

ఆడి క్యూ-డ్రైవ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 500 మీటర్ల పొడవున ఏర్పాటు చేసిన ఈ ట్రాక్‌పై పలు డ్రైవింగ్ సవాళ్లతో కూడిన రోడ్లు/అడ్డంకులు ఉంటాయి.

ఈ స్పెషల్ ట్రాక్‌పై రోడ్డుపై గుంతలు, చిన్న పెద్ద హంప్స్ (ఎత్తు పళ్లాలుగా ఉండే రోడ్డు), బురద గుంటలు, రాళ్లతో నిండిన రోడ్డు ఇలా అనేక అడ్డంకులు ఉంటాయి. ఆడి క్యూ సిరీస్ ఎస్‌యూవీలతో వీటిని అధిమించడం టాస్క్.

ట్రాక్‌పై బాగా ఎత్తులో నిర్మించిన హంప్ వలన ఆడి ఎస్‌యూవీల యొక్క హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ పంక్షన్లను చెక్ చేసేందుకు అవకాశం ఏర్పడింది. భారీ ఎత్తు పళ్లాలు కలిగిన రోడ్లపై వాహనం జారిపోతుందనే టెన్షన్ లేకుండా ప్రయాణించేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడుతాయి.

ఈ ఫీచర్లను ఆన్ చేస్తే, వాహనం దిగుడు లేదా ఎగుడులో ఉన్నప్పుడు (45 డిగ్రీల కోణంలో ఉన్న సరే) సైతం బ్రేకులు అప్లయ్ చేయకుండానే, వాహనం కదలకుండా ఎక్కడ ఉన్న స్థానంలో అక్కడే ఉంటుంది. కదలాటానికి కేవలం యాక్సిలరేషన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

మేము ఆడి క్యూ5 కారును నడిపాము. ఇందులో శక్తివంతమైన 2.0 లీటర్ టిడిఐ ఇంజన్‌ను ఉంటుంది. ఇది గరిష్టంగా 174 హెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 2 అడుగులు లోతున్న గుంతల్లో సైతం ఇది సమర్థవంతమైన పనితీరును కనబరిచింది.

ఈ ట్రాక్‌లో జారుడు స్వభావం కలిగిన బురదపై నడపటం రిస్కుతో కూడిన టాస్క్. ఇలాంటి రోడ్లపై సైతం ఆడి క్యూ సిరీస్ ఎస్‌యూవీలు సునాయాసంగా ప్రయాణిస్తూ, అత్యుత్తమ సేఫ్టీని అందించగలవు.

ఒకానొక సందర్భంలో ఆడి క్యూ7 ఎస్‌యూవీ ఈ బురదలో కూరుకుపోయింది. కానీ ఇది ఎవరి సాయం లేకుండా, కొంత సమయం తర్వాత బయటకు రాగలిగింది.

ఆడి క్యూ7లోని ఆఫ్-రోడింగ్ టైర్ల ద్వారా ఇది సాధ్యమైంది. ఆసక్తికరమైన విషయం ఏటంటే, ఈ ఆఫ్-రోడింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆడి ఎస్‌యూవీలన్నింటినీ ఏమాత్రం మోడిఫై చేయలేదు.

మా అనుభవాన్ని బట్టి ఈ మూడు రకాల వాహనాలు మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండి, ఎలాంటి రోడ్లపై అయినా ప్రయాణించడమే కాకుండా, కారులోని ప్రయాణికులకు సైతం పూర్తి సెక్యూరిటీని అందిస్తుంది.

ఆడి క్యూ3 డిటేల్స్
ఇంజన్: 1968సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్
పవర్: 175 బిహెచ్‌పి (4200 ఆర్‌పిఎమ్)
టార్క్: 380 ఎన్ఎమ్ (1750 ఆర్‌పిఎమ్)
ట్రాన్సిమిషన్: 7-స్పీడ్ ఎస్-ట్రానిక్ ఆటోమేటిక్

ఆడి క్యూ5 డిటేల్స్
ఇంజన్: 1968సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్
పవర్: 175 బిహెచ్‌పి (4200 ఆర్‌పిఎమ్)
టార్క్: 380 ఎన్ఎమ్ (1750 ఆర్‌పిఎమ్)
ట్రాన్సిమిషన్: 7-స్పీడ్ ఎస్-ట్రానిక్ ఆటోమేటిక్

ఆడి క్యూ7 డిటేల్స్
ఇంజన్: 2967సీసీ, వి-6 డీజిల్ ఇంజన్
పవర్: 243 బిహెచ్‌పి (3800 ఆర్‌పిఎమ్)
టార్క్: 550 ఎన్ఎమ్ (1750 ఆర్‌పిఎమ్)
ట్రాన్సిమిషన్: 8-స్పీడ్ ఎస్-ట్రానిక్ ఆటోమేటిక్

బెంగుళూరులో ఆడి క్యూ డ్రైవ్ ఎక్స్‌పీరెయన్స్


Click it and Unblock the Notifications








