భారత్‌లో ఆడి ఆర్8 వి10 సూపర్ స్పోర్ట్స్ కారు విడుదల
జర్మనీకు చెందిన లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఆర్8 సిరీస్‌లో మరింత శక్తివంతమైన సూపర్ స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా వచ్చిన ఈ పవర్‌ఫుల్ 'ఆడి ఆర్8 వి10 ప్లస్' సూపర్ స్పోర్ట్స్ కారు ధర రూ.2.05 కోట్ల (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ కారులో శక్తివంతమైన వి10 ప్లస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 550 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో లభిస్తుంది.
ఆడి ఆర్8 వి10 ప్లస్ సూపర్ స్పోర్ట్స్ కారు కేవలం 3.5 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 917 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. భారత్‌లోని సూపర్ స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు ఆడి ఆర్8 వి10 ప్లస్ కారు ఎంతగానో సహకరిస్తుందని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. ఈ ఏడాది జనవరి నెలలో ఆడి ఇండియా తమ ఆర్8 సిరీస్‌లో 'ఆడి ఆర్8 వి8 కూపే' సూపర్ స్పోర్ట్స్ కారును కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే.
దేశీయ విపణిలో ఆడి వి8 కూపే ధర రూ.1.35 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కారులో ఉపయోగించిన 4.2 లీటర్ వీ8 ఇంజన్ గరిష్టంగా 430 హెచ్‌పిల శక్తిని, 430 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కూడా 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది తమ ఆడి ఆర్8 వి10 ప్లస్ విడుదలతో, గ్లోబల్ మార్కెట్లలో ఆర్8 సిరీస్‌లో లభిస్తున్న అన్ని మోడళ్లు భారత్‌లో కూడా లభ్యం కానున్నాయని కంపెనీ తెలిపింది.

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి ఆర్8 వి10 ప్లస్



Click it and Unblock the Notifications








