బ్రేక్ సిస్టమ్ సమస్య: 382 ఆడి క్యూ7 ఎస్‌యూవీలు వెనక్కి
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో విక్రయించిన 382 యూనిట్ల ఆడి క్యూ7 ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రేక్ సిస్టమ్‌లో సమస్యల కారణంగా ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్రేక్ సిస్టమ్‌లో వాక్యూమ్ లైన్‌ను రీప్లేస్ చేసేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ ప్రకటించిన రీకాల్‌లో భాగంగా, భారత్‌లో కూడా ఆడి క్యూ7 ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నామని కంపెనీ వివరిచింది.
ఇదే సమస్యపై జర్మన్ కంపెనీ ఆడి ఏజి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70,000 ఆడి ఏ4, ఆడి ఏ5, ఆడి ఏ6 మరియు ఆడి ఏ7 సెడాన్లను మరియు ఆడి క్యూ5, ఆడి క్యూ7 ఎస్‌యూవీలను రీకాల్ చేసింది. ఇందులో మొత్తం 382 యూనిట్ల ఆడి క్యూ7 ఎస్‌యూవీలను ఇండియాలో రీకాల్ చేసింది. మార్చ్-డిసెంబర్ 2012 మధ్య కాలంలో విక్రయించిన 3.0 లీటర్, టిడిఐ ఇంజన్ వెర్షన్లలో ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.

పైన పేర్కొన్న కాలంలో విక్రయించిన ఆడి క్యూ7 ఎస్‌యూవీలను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లలో తయారైనవే. ఆడి ఇండియా 2013లో క్యూ7 ఎస్‌యూవీని స్థానికంగానే ఔరంగాబాద్ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించింది. ఇప్పటి వరకూ కంపెనీ మొత్తం 5000 యూనిట్లకు పైగా ఆడి క్యూ7 ఎస్‌యూవీలను భారత మార్కెట్లో విక్రయించింది.
ఈ రీకాల్‌కు వర్తించే 382 ఆడి క్యూ7 కస్టమర్లను తమ డీలర్లు సంప్రదించే ప్రక్రియ ప్రారంభించారని, బ్రేక్ సిస్టమ్‌లో వాక్యూమ్ లైన్ రీప్లేస్‌మెంట్ కోసం కస్టమర్లతో అపాయింట్‌మెంట్‌ను ఏర్పాటు చేసుకొని, డీలర్‌షిప్‌కు తీసుకువచ్చే కార్లలో ఈ భాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ మరమ్మత్తు కోసం దాదాపు అరగంట సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.
బ్రేక్ సిస్టమ్‌లో వాక్యూమ్ లైన్ లోపం కారణంగా ఇంజన్ ఆయిల్ బ్రేక్ సిస్టమ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని, ఫలితంగా బ్రేక్ సిస్టమ్ సామర్థ్యం దెబ్బతింటుందని కంపెనీ పేర్కొంది. అయినప్పటికీ బ్రేకులు పనిచేస్తూనే ఉంటాయని, కాకపోతే బ్రేక్ పెడల్‌పై ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని ఆడి ఇండియా వివరించింది. ఈ బ్రేక్ సమస్య కేవలం 3.0 లీటర్, టిడిఐ డీజిల్ ఇంజన్ కలిగి క్యూ7 మోడళ్లలో మాత్రమే ఉంటుందని, ఇతర పెట్రోల్, డీజిల్ మోడళ్లలో ఈ సమస్య లేదని కంపెనీ తెలిపింది.

భారత మార్కెట్లో ఆడి క్యూ7 ప్రస్తుతం మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. అవి -
* 3.0 లీటర్ టిడి క్వాట్రో డీజిల్ ఇంజన్ 180 కి.వా. శక్తిని, 550 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 12.62 కి.మీ. మైలేజీనిస్తుంది.
* 4.2 లీటర్ టిడిఐ క్వాట్రో డీజిల్ వేరియంట్ గరిష్టంగా 250 కి.వా. శక్తిని, 800 ఎన్ఎమ్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ డీజిల్‌కు 10.10 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
* 3.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ క్వాట్రో వి6-సిలిండర్ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 245 కి.వా. శక్తిని, 440 ఎన్ఎమ్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 8.62 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ఈ మూడు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన భద్రతా ఫీచర్లతో ఆడి ఇండియా తమ పవర్‌ఫుల్ క్యూ7 ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది భారత మార్కెట్లో ఆడి క్యూ7 ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.60 లక్షలకు పైగానే ఉంది. మొదట్లో ఈ మోడల్‌ను సిబియూ రూట్లో దిగుమతి చేసుకొని విక్రయించే వారు. అయితే, ఆడి ఇండియా గడచిన సంవత్సరంలో తమ క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీని మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్‌లోని ప్లాంట్ అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించింది.


Click it and Unblock the Notifications








