భారత్‌లో ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ విడుదల: ధర, వివరాలు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో మరో శక్తవంతమైన స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. ప్రముఖ బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ఈ సరికొత్త 'ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్' (Audi RS 7 Sportback) కారును సోమవారం భారత మార్కెట్లో మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఆడి ఇండియా నుంచి భారత్‌లో లభిస్తున్న కార్లలో కెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది.
దేశీయ విపణిలో ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కారు ధర రూ. 1.28 కోట్లు (ఎక్స్ షోరూమ్, ముంబై). తాము గతంలో అందించిన ఆడి ఆర్‌ఎస్ 5 కారుకు మంచి స్పందన లభించిందని, అందుకే ఇప్పుడు తాజాగా ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కారును భారత్‌లో ప్రవేశపెట్టామని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ తెలిపారు. ఈ ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ తొలి కారును కంపెనీ సల్మాన్ ఖాన్‌కు విక్రయించింది.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కారులో 4.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ ట్విన్ టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6700 ఆర్‌పిఎమ్ వద్ద 560 హార్స్ పవర్‌ల శక్తిని, 1750-5500 ఆర్‌పిఎమ్ వద్ద 700 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ట్రాన్సిమిషన్ ద్వారా ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా కాకుండా, వెనుక చక్రాలకు 60 శాతం మిగిలిన 40 శాతం ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. ఇందుకోసం ఆడి క్వాట్రో సిస్టమ్‌ను ఉపయోగించారు.

ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కారు కేవలం 3.9 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు. స్పోర్టీ పెర్ఫామెన్స్ కోసం ఇందులో ఎయిర్ సస్పెన్షన్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కారును రోడ్లపై అల్టిమేట్ లగ్జరీ కారు గానూ, రేస్ ట్రాక్ పెర్ఫామెన్స్ స్పోర్ట్స్ కారు గాను ఉపయోగించుకోవచ్చు. రోడ్ యూజ్ కోసం ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్ (ఈఎస్‌సి) సేఫ్టీ ఫీచర్‌గా లభిస్తుంది. అదే ట్రాక్‌పై నడపాలనుకున్నప్పుడు స్పోర్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేస్తే ఈ ఫీచర్ ఆఫ్ అవుతుంది.

సిలిండర్ ఆన్ డిమాండ్ (సిఓడి) టెక్నాలజీతో మెరుగైన మైలేజీనిచ్చేలా ఆడి ఈ కారును తయారు చేసింది. ఇది సగటున లీటరుకు 10.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. (సిటీ రోడ్లపై లీటరుకు 7.19 కి.మీ., హైవేపై లీటరుకు 13.33 కి.మీ.).

ఎల్‌ఈడి హెడ్‌లైట్స్, ఎల్‌ఈడి రియర్ లైట్స్, ఎమ్ఎమ్ఐ నావిగేషన్, ఎమ్ఎమ్ఐ టచ్, బోస్ సౌండ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మోనిటర్, టెంపరేచర్ డిస్‌ప్లే వంటి పలు ప్రత్యేకతలు దీని సొంతం.

ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ ఈ సెగ్మెంట్లోని బిఎమ్‍డబ్ల్యూ ఎమ్5, మెర్సిడెస్ బెంజ్ ఈ 63 ఏఎమ్‌జి వంటి పెర్ఫామెన్స్ లగ్జరీ కార్లకు పోటీగా నిలుస్తుంది.

ఈ ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ తొలి కారును కంపెనీ సల్మాన్ ఖాన్‌కు విక్రయించింది.


Click it and Unblock the Notifications








