భారత్‌లో ఆడి ఎస్6 విడుదల; ధర రూ.86 లక్షలు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా మరొక సరికొత్త లగ్జరీ కారు 'ఆడి ఎస్6' (Audi S6)ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఆడి ఎస్6 పెర్ఫామెన్స్ స్పోర్ట్స్ కారు ధర రూ.85.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
కంపెనీ అందిస్తున్న లగ్జరీ సెడాన్ ఆడి ఏ6కు పెర్ఫామెన్స్ వెర్షనే ఈ ఆడి ఎస్6. ఆడి ఏ6 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కారును అభివృద్ధి చేశారు. అయితే, ఈ రెండు మోడళ్లలో డిజైన్, ఫీచర్స్, పెర్ఫామెన్స్ విషయాల్లో మాత్రం అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి.
ఆడి ఎస్6 పెర్ఫామెన్స్ కారులో 4.0 లీటర్ వి8 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 420 బిహెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ పాపులర్ 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జచేయబడి ఉంటుంది. ఇది కేవంల 4.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.
ఇంతటి స్పోర్టీ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉన్నప్పటికీ ఇది మెరుగైన మైలేజీని (10.3 కెఎమ్‌పిఎల్) ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉపయోగించిన సిలిండర్ ఆన్ డిమాండ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో కారు లోడ్ కండిషన్‌ను బట్టి ఇది ఫోర్-సిలిండర్ ఇంజన్ మాదిరిగా పనిచేసి, తక్కువగా ఇంధనాన్ని గ్రహిస్తుంది.
ఆడి క్వాట్రో టెక్నాలజీతో ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. ఆడి ఎస్6 ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5, మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి వంటి మోడళ్లతో పోటీపడనుంది.

ఆడి ఎస్6
కంపెనీ అందిస్తున్న లగ్జరీ సెడాన్ ఆడి ఏ6కు పెర్ఫామెన్స్ వెర్షనే ఈ ఆడి ఎస్6. ఆడి ఏ6 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కారును అభివృద్ధి చేశారు. అయితే, ఈ రెండు మోడళ్లలో డిజైన్, ఫీచర్స్, పెర్ఫామెన్స్ విషయాల్లో మాత్రం అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి.

ఆడి ఎస్6
ఆడి ఎస్6 పెర్ఫామెన్స్ కారులో 4.0 లీటర్ వి8 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 420 బిహెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆడి ఎస్6
ఈ ఇంజన్ పాపులర్ 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జచేయబడి ఉంటుంది. ఇది కేవంల 4.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.

ఆడి ఎస్6
దేశీయ విపణిలో ఆడి ఎస్6 పెర్ఫామెన్స్ స్పోర్ట్స్ కారు ధర రూ.85.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఆడి ఎస్6 - ఇంటీరియర్స్

ఆడి ఎస్6 - ఇన్ఫోటైన్‌మెంట్

ఆడి ఎస్6 - డిజిటల్ అండ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఆడి ఎస్6- ప్రీమియం లెథర్ స్పోర్టీ సీట్స్

ఆడి ఎస్6- రియర్ సీట్స్

ఆడి ఎస్-6 విశాలమైన బూట్ స్పేస్

ఆడి ఎస్6 - సైడ్ వ్యూ



Click it and Unblock the Notifications








