రిపేర్స్‌ను మెరుగు పరచేందుకు ఆర్ట్ రోబోను ఆవిష్కరించిన ఆడి
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లలో మరమ్మత్తు సేవలను మరింత మెరుగు పరచేందుకు అధునాతన సాంకేతిక వ్యవస్థతో కూడుకున్న రోబోలను ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు ఆడి రూపొందించిన ఏఆర్‌టి (ఆర్ట్ అని పలకాలి) (ఆడి రోబోటిక్ టెలీప్రజెన్స్) అని పిలిచే ఓ అధునాత రోబోట్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ రోబోట్ డీలర్‌షిప్ టెక్నీషియన్‌కు మరియు ఆడి అమెరికాలోని సర్వీస్ ఎక్స్‌పర్ట్‌కు విర్చ్యువల్ లింక్ ఏర్పాటు చేస్తుంది.

అంటే, ఈ రోబోకు ఓ హై డెఫినెషన్ కెమెరా అమర్చబడి ఉంటుంది. ఈ రోబోను అమెరికాలోని ఆడి సర్వీస్ ఎక్స్‌పర్ట్స్ తమ కంప్యూటర్ సాయంతో కంట్రోల్ చేసే వెసలు బాటు ఉంటుంది. అంతేకాకుండా, కారుకు సంబంధించిన సమ్యసను ఈ కెమెరా సాయంతో చూస్తూ, డీలర్‌షిప్‌లో సర్వీస్ టెక్నీషియన్లకు అమెరికా నుంచే సూచనలు ఇవ్వటం జరుగుతుంది.
దీని వలన ఆడి అమెరికన్ సర్వీస్ ఎక్స్‌పర్ట్‌ను పక్కనే ఉంచుకొని, సదరు డీలర్‌షిప్ టెక్నీషియన్ కారును రిపేరు చేసిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా మరమ్మత్తు సేవలు కూడా మెరుగు పడతాయి.
ఆడి అమెరికా జనరల్ మేనేజర్ (టెక్నికల్ సపోర్ట్) బ్రియాన్ స్టాక్టన్ తెలిపిన సమాచారం ప్రకారం, ఆడి టెక్నీషియన్లను మరియు కన్జ్యూమర్లను దృష్టిలో ఉంచుకొని ఆర్ట్ రోబోను తయారు చేశామని చెప్పారు. ఈ రోబో స్థానిక సర్వీస్ టెక్నీషియన్‌ను ఆడి అమెరికా సర్వీస్ ఎక్స్‌పర్ట్‌లను ఒకరినొకరు అనుసంధానం అయ్యేలా చేసి, డీలరు స్థాయిలో సర్వీసును వేగవంతం చేయటమే కాకుండా, కన్జ్యూమర్ ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగు పరచడంలో కూడా ఇది సహకరిస్తుందని ఆయన వివరించారు. ఆడి ఆర్ట్ రోబో పనితీరును ఈ వీడియోలో వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/B6WP80E1id0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








