పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో కొత్త 2015 ఆడి ఏ1 కారు ఆవిష్కరణ
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి నుంచి అత్యంత సరసమైన ధరకే ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేసిన ఈ కంపెనీ, తాజాగా 2015 ఆడి ఏ1 హ్యాచ్‌బ్యాక్ మరియు ఆడి ఏ1 స్పోర్ట్‌బ్యాక్ మోడళ్లను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది నుంచి ఈ రెండు మోడళ్లు పలు అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యం కానున్నాయి.
ఆడి ఏ1 మోడళ్లను ముందుగా యూకే మార్కెట్లోను, ఆ తర్వాత పలు అంతర్జాతీయ మార్కెట్లలోను విడుదల చేయనున్నారు. ఆడి ఏ1 హ్యాచ్‌బ్యాక్ ధర సుమారు రూ.15 లక్షలు, ఆడి ఏ1 స్పోర్ట్‌బ్యాక్ ధర సుమారు రూ.21 లక్షలు ఉండొచ్చని అంచనా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ కొత్త ఆడి ఏ1 మోడళ్లలో అనేక కాస్మోటిక్, మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, విభిన్న కలర్ ఆప్షన్స్, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో 2015 ఆడి ఎ1 మోడళ్లు లభ్యం కానున్నాయి. ఇవి రెండు పెట్రోల్ ఇంజన్స్, ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. అవి -
- 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 95 బిహెచ్‌పి పవర్
- 1.4 లీటర్, 3-సిలిండర్ డీజిల్ ఇంజన్, 90 బిహెచ్‌పి పవర్
ఈ మోడళ్లలో మరింత పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. అయితే, బడ్జెట్ లగ్జరీ కార్లకు ప్రాధాన్యతనిచ్చే అనేక మార్కెట్లలో మాత్రం ఈ 3-సిలిండర్ ఇంజన్లనే ఆఫర్ చేయనున్నారు.
గేర్‌బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. కస్టమర్లు 5-స్పీడ్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ని ఎంచుకోవచ్చు. ఆటోమేటిక్ వేరియంట్‌ను ఎంచుకునే వారి కోసం కంపెనీ 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ ట్విన్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఆఫర్ చేయనుంది. ఈ మోడళ్ల కోసం ఆడి వివిధ ఆప్షన్ ప్యాక్‌లను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత లగ్జరీ కార్ మార్కెట్లో మరింత పట్టు సాధించుకునేందుకు ఆడి ఇండియా, తమ ఏ1 ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లను ఇండియా మార్కెట్లో కూడా విడుదల చేస్తామని ప్రకటించడం. అయితే, ఈ కార్లు ఖచ్చితంగా ఎప్పుడు ఇండియాకు వస్తాయని చెప్పలేం కానీ, ఒకవేళ ఇండియాకి వస్తే మాత్రం.. ఇక్కడి మార్కెట్లో ఇదే అత్యంత చవకైన ఆడి కారు కావటం ఖాయం.


Click it and Unblock the Notifications








