ఆటో ఎక్స్‌పో 2014: జాగ్వార్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

By Ravi

బ్రిటీష్ లగ్జరీ సెడాన్ మేకర్ జాగ్వార్ తొలిసారి తయారు చేసిన ఎస్‌యూవీ 'జాగ్వార్ సి-ఎక్స్17'ని ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది.

జాగ్వార్ ఈ ఎస్‌యూవీని తొలిసారిగా 2013లో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో (బ్లూ కలర్) ఆ తర్వాత అదే సంవత్సరంలో జరిగిన దుబాయ్ మోటార్ షో (లిక్విడ్ అల్యూమినియం మెటల్ ఫినిష్‌)ను ఆవిష్కరించింది.

కాగా.. ఈ 2014 ఇండియా ఆటో ఎక్స్‌పో కోసం జాగ్వార్ ఓ గోల్డ్ కలర్ సి-ఎక్స్17 కారును తయారు చేసింది.

జాగ్వార్ తొలి ఎస్‌యూవీ కాన్సెప్ట్ సి-ఎక్స్17 మోడల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

జాగ్వార్ సి-ఎక్స్17

జాగ్వార్ సి-ఎక్స్17 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఫ్లెక్సిబల్ మరియు అత్యంత అధునాతనమైన మాడ్యులర్ అల్యూమినియం ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో జాగ్వార్ నుంచి రానున్న ఇతర అన్ని నెక్స్ట్-జెన్ ఎస్‌యూవీలకు/ఉత్పత్తుల తయారీకి ఇదే మాడ్యులర్ అల్యూమినియం ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించనున్నారు.

జాగ్వార్ సి-ఎక్స్17

పెద్ద హనీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్, హనీకోంబ్ ఎయిర్ ఇన్‌టేక్స్, ఎయిర్ ఇన్‌టేక్స్ చుట్టూ బోల్డ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, మిర్రర్లపై ఎల్ఈడి ఇండికేటర్స్ వంటి అనేక కొత్త అంశాలను జాగ్వార్ సి-ఎక్స్17 కాన్సెప్ట్‌లో చూడొచ్చు.

జాగ్వార్ సి-ఎక్స్17

ఇది కాన్సెప్ట్ వెర్షన్ కాబట్టి, ప్రొడక్షన్ దశకు చేరుకునే వెర్షన్‌లో ఇందులోని కొన్ని ఫీచర్లు కోల్పోయే ఆస్కారం ఉంది. ఇది ల్యాండ్ రోవర్ అందిస్తున్న ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీల మాదిరిగా కాకుండా ఎవోక్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుందని అని తెలుస్తోంది. ప్రత్యేకించి అర్బన్ రోడ్ల కోసం తయారు చేసిన మోడల్‌గా అనిపిస్తుంది.

జాగ్వార్ సి-ఎక్స్17

జాగ్వార్ విడుదల చేయనున్న ఈ ఎస్‌యూవీలలో ఉపయోగించేందుకు గాను కంపెనీ సరికొత్త 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

జాగ్వార్ సి-ఎక్స్17

ప్రస్తుతం ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుండటంతో జాగ్వార్ బ్రాండ్‌లో కూడా యుటిలిటీ వాహనాలను ఆఫర్ చేసేందుకు కంపెనీ సిద్ధమయ్యింది. వీలైనంత త్వరగా ఈ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకవచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, 2015లో ఇది మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Jaguar C-X17 crossover concept that first broke cover in September 2013 at the Frankfurt Auto Show. Now, for the first time the same crossover concept made its appearance in India during the Auto Expo 2014.
Story first published: Saturday, February 15, 2014, 18:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X