ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను విడుదల చేయనున్న బజాజ్
గడచిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో ఆవిష్కరించిన నాలుగు చక్రాల వాహనం (ఫోర్-వీలర్) 'బజాజ్ ఆర్ఈ60' గుర్తుందా..? ఈ ఫోర్-వీలర్ త్వరలోనే ఉత్పత్తి దశకు చేరుకోనున్నట్లు ఇది వరకే తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు బజాజ్ ఆర్ఈ60 ఔరంగాబాద్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రారంభంలో భాగంగా కేవలం 5,000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని, ఈ మోడల్‌కు లభించే స్పందనను బట్టి తర్వాతి ఉత్పత్తి ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోర్-వీలర్ గురించి బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. ఈ వాహనం యొక్క వర్గీకరణ గురించి భారత ప్రభుత్వం యొక్క అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి చర్చించాల్సిన అవసరం ఉందని, వారి నిర్ణయం తర్వాతనే ఆర్-60 వాహనాన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈ వాహనంపై ప్రభుత్వ నియంత్రణలు వెల్లడించిన తర్వాతనే దీని ధరను ప్రకటిస్తామని రాజీవ్ బజాజ్ చెప్పారు.

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60
బజాజ్ ఆటో తమ ఆర్ఈ-60లో ఓ కమర్షియల్ వెర్షన్‌ను (గ్రీన్ కలర్ ఆర్ఈ60) మరొక పర్సనలైజ్డ్ వెర్షన్‌ను (యల్లో కలర్ ఆర్ఈ60) గడచిన సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన 2012 అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాంప్రదాయ ఆటోలకు ప్రత్యామ్నాయంగా బజాజ్ ఆర్ఈ60 మార్కెట్లోకి రానుంది. ఈ సెగ్మెంట్లోని మాహీంద్రా మ్యాక్సిమో మినీ వ్యాన్, టాటా మ్యాజిక్ ఐరిస్ వంటి మోడళ్లకు ఇది పోటీగా నిలువనుంది.
పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్ కోరుకునే వారికోసం పర్సనలైజ్డ్ ప్రీమియం ఆర్ఈ60ని, వాణిజ్య రవాణా అవసరాల కోసం కమర్షియల్ ఆర్ఈ60ని కంపెనీ ఆఫర్ చేయనుంది. పర్సనలైజ్డ్ ఆర్ఈ60లో అల్లాయ్ వీల్స్, వెనుక వైపు పూర్తి బాడీ ప్యానెల్, ప్రీమియం ఇంటీరియర్స్, సైడ్ విండో గ్లాసెస్, క్లియర్ లెన్స్ హెడ్‌లైట్స్ అండ్ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లతో లభ్యం కానుంది. కమర్షియల్ వెర్షన్ ఆర్ఈ60లో వెనుక వైపు ఫుల్ బాడీ ప్యానెల్‌కు బదులు కర్టెన్, అల్లాయ్ వీల్స్ స్థానంలో సాధారణ వీల్స్, సాధారణ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్‌తో ఇది లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








