బజాజ్ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్ లాంచ్ వాయిదా పడిందా?

బజజ్ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్ భవితవ్యం అయోమయంలో పడిందనే చెప్పాలి. ఇది ఈ సంవత్సరంలో భారత్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు, వచ్చే ఏడాది చివరి నాటికే మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

ఈ మేరకు, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రెగ్యులేషన్స్ (సిఎమ్‌విఆర్)లోని వాణిజ్య వాహనాల విభాగం క్రింద 'క్వాడ్రిసైకిల్' (Quadricycle) అనే విభాగాన్ని కొత్త సృష్టించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే ఓ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రూపొందించింది. దీనికి ఆమోదం లభిస్తుంది, ఇవి భారత రోడ్లపై తిరింగేందుకు అవకాశం లభిస్తుంది.

అయితే, ఇందుకు సంబంధించి ఈ క్వాడ్రిసైకిల్ వాహన విషయంలో పాటించాల్సిన కొన్ని నిబంధనలను కూడా ఈ బిల్లులో నిర్దేశించారు. ప్యాసింజర్ కార్లకు, క్వాడ్రిసైకిళ్లకు మధ్య వ్యత్యాసాన్ని ఉంచేందుకు గాను వీటి బరువు, గరిష్ట వేగాల్లో పరిమితులు విధించనున్నారు. అంతేకాకుండా, వీటిని కేవలం టాక్సీ, కార్గో సెగ్మెంట్ల క్రింద మాత్రమే అనుమతించనున్నారు, పర్సనల్ ప్యాసింజర్ వెహికల్‌గా మాత్రం అనుమతించరు.

మరి బజాజ్ ప్లాన్స్ ఏంటి? తెలుసుకోవాలంటే, ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

ప్రొడక్షన్ రెడీ..

ప్రొడక్షన్ రెడీ..

ప్రస్తుతం బజాజ్ ఆటో ఈ క్వాడ్రిసైకిళ్లను మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయడానికి సిద్ధం ఉంది. అయితే, భారత్‌లో వీటికి ఆమోదం లభించే లోపుగా, ఈ క్వాడ్రిసైకిళ్లను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ఎగుమతి రెడీ..

ఎగుమతి రెడీ..

భారత మార్కెట్లో ఈ కారును ప్రవేశపెట్టేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రితో బజాజ్ ఆటో ప్రతినిధుల జరుపుతున్న చర్చలు ఫలప్రదం కావట్లేదు. ఈ నేపథ్యంలో ఈయూ సభ్య దేశాల్లో ఈ కారును ఆవిష్కరించేందుకు ప్రణాళిక రూపొందించామని రాజీవ్ బజాజ్‌ తెలిపారు.

గ్రీన్ సిగ్నల్ లభిస్తేనే..

గ్రీన్ సిగ్నల్ లభిస్తేనే..

బజాజ్ ఆర్ఈ60 కేంద్రం నుంచి స్పష్టమైన అనుమతి లభించిన తర్వాతనే, వీటిని భారత మార్కెట్లో విడుదల చేస్తామని బజాజ్‌ ఆటో పేర్కొంది. కంపెనీ సమాచారం ప్రకారం, 2014 చివరి నాటికి ఇవి భారత రోడ్లపై పరుగులు తీయవచ్చని తెలుస్తోంది.

ఇతర కంపెనీల నుంచి వ్యతిరేఖత

ఇతర కంపెనీల నుంచి వ్యతిరేఖత

అయితే, ఈ క్వాడ్రిసైకిళ్లను భారత్‌లో విక్రయించడాన్ని మాత్రం కొన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వీటికి అనుమతినిచే అంశాన్ని కేంద్రం పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాయి.

డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొన్న నిబంధనలు

డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొన్న నిబంధనలు

గూడ్స్ (రవాణా), ప్యాసింజర్ క్యారీయర్ వెర్షన్ క్వాడ్రిసైకిళ్లు రెండింటినీ కూడా భారత రోడ్లపై అనుమతించనున్నారు. ప్యాసింజర్లను తీసుకు వెళ్లే క్వాడ్రిసైకిళ్ల బరువు 450 కిలోగ్రాములు, గూడ్స్ క్యారీయర్ క్వాడ్రిసైకిళ్ల బరువు 550 కిలోగ్రాములు ఉండాలి.

డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొన్న నిబంధనలు

డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొన్న నిబంధనలు

ఈ తరహా వాహనాలను క్వాడ్రిసైకిళ్లని సులువుగా గుర్తించేందుకు గాను, ఇలాంటి అన్ని వాహనాల ముందు భాగంలో 'Q' అనే అక్షరాన్ని ఉంచాల్సి ఉంటుంది. వీటి గరిష్ట వేగాన్ని గంటకు 70 కిలోమీటర్లకు నియంత్రిస్తారు. ప్యాసింజర్ క్యారీయర్ వెర్షన్ 3+1 సీటింగ్‌తోను (డ్రైవర్ + 3 ప్యాసింజర్స్), గూడ్స్ క్యారీయర్ వెర్షన్ 1+1 సీటింగ్ (డ్రైవర్ + కో ప్యాసింజర్) డిజైన్‌ను కలిగి ఉండాలి.

బజాజ్ ఆటో ఆర్ఈ60 గురించి..

బజాజ్ ఆటో ఆర్ఈ60 గురించి..

బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను తొలిసారిగా గడచిన సంవత్సరంలో జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఇది కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే కాకుండా, సీఎన్‌జీ మరియు ఎల్‌పీజీ వెర్షన్లలో కూడా విడుదల కానుంది. సీఎన్‌జీ వెర్షన్ కేజీకి 35-37 కి.మీ. మైలేజీని, ఎల్‌పీజీ వెర్షన్ లీటరుకు 30 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

బజాజ్ ఆర్ఈ60 ఫీచర్లు:

బజాజ్ ఆర్ఈ60 ఫీచర్లు:

* 200సీసీ పెట్రోల్ ఇంజన్

* సిటీ ట్రాఫిక్‌లకు, రోడ్లకు చక్కగా సరిపోతుంది.

* గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.

* ప్రకృతి సాన్నిహిత్యమైనది (ఎకో-ఫ్రెండ్లీ)

* ఫోర్ సీటర్ (నలుగురు ప్రయాణికులు సులువుగా ప్రయాణించవచ్చు)

బజాజ్ ఆర్ఈ60 ఫీచర్లు:

బజాజ్ ఆర్ఈ60 ఫీచర్లు:

* కారు పొడవు x వెడల్పు x ఎత్తు : 2752 మి.మీ. x 1312 మి.మీ. x 1650 మి.మీ.

* కారు మొత్తం బరువు: 400 కేజీలు

* కనీస టర్నింగ్ రేడియస్ - 3.5 మీటర్లు

* లగేజ్ (బూట్) స్పేస్ - 44 లీటర్లు

* అంచనా ధర - రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)

More from DriveSpark

Article Published On: Saturday, September 28, 2013, 17:12 [IST]
English summary
Is seems Bajaj Auto has postponed the launch its RE60 quadricycle by end-2014. The Indian government has issued a draft notification to classify the quadricycle as a commercial vehicle under the Central Motor Vehicles Regulations (CMVR) and once this is approved, quadricycles will be officially eligible to ply on Indian roads.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+