ఆటో ఎక్స్‌పో 2012: బజాజ్ యూ కార్ కాన్సెప్ట్ ఆవిష్కరణ

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో తమ సరికొత్త కాంపాక్ట్ కార్ 'యూ కార్' (U Car)ని ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బజాజ్ ఆటో ప్రదర్శించిన ఈ యూ కార్ కాన్సెప్ట్ వీక్షకులను కట్టిపడేసింది.

ఇది పేరుకు మాత్రమే యూ కార్. కానీ ఓ సంపూర్ణమైన కారు కాదు. నాలుగు చక్రాలు ఉన్నంత మాత్రాన దీనిని కారుగా పరిగణించడానికి వీల్లేదు. భవిష్యత్తులో వ్యక్తిగత రవాణా అవసరాల కోసం కంపెనీ ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసింది.

'బజాజ్ యూ కార్' కాన్సెప్ట్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్

బజాజ్ యూ కార్ కూడా బజాజ్ ఆర్ఈ60 మాదిరిగానే ఓ క్వాడ్రిసైకిల్ (నాలుగు చక్రాలు కలిగిన వాహనం).

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్

బజాజ్ ఆర్ఈ60 కమర్షియల్ ప్యాసింజర్ క్వాడ్రిసైకిల్ అయితే, ఈ బజాజ్ యూ కార్ మాత్రం పర్సనల్ క్వాడ్రిసైకిల్.

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్

బజాజ్ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌ను వ్యక్తిగత రవాణా కోసం ఉపయోగించరాదని భారత సర్కారు సూచించడంతో, ఈ ప్రయోజనం కోసం బజాజ్ ఈ కొత్త యూ కార్ కాన్సెప్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది.

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్

బజాజ్ ఆర్ఈ60తో పోల్చుకుంటే, బజాజ్ యూ కార్ తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేస్తూ, అధిక మైలేజీనిస్తుంది.

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్

అయితే, ఇది బజాజ్ ఆర్60 పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ వేరియంట్‌కు ప్రత్యామ్నాయం మాత్రం కాదు.

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. దీని బరువును తక్కువగా ఉంచేందుకు గాను ఇందులో తేలికపాటి పదార్థాలను ఉపయోగించారు. బజాజ్ యూ కార్ మొత్తం బరువు కేవలం 300 కేజీలు మాత్రమే.

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్

బజాజ్ యూ కార్‌లో లిక్విడ్ కూల్డ్, ఫోర్-వాల్వ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ విత్ ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌‌ను ఉపయోగించారు (పెర్ఫామెన్స్ వివరాలను వెల్లడించలేదు). ఈ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్

సిజర్ డోర్స్ (నేరుగా పైవైపుకి తెరుచుకునే డోర్స్) యూ కార్‌లో మరో విశిష్టత. సన్నటి పార్కింగ్ ప్రదేశాల్లో సైతం ఈ కారును ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్క్ చేయవచ్చు.

బజాజ్ యూ కార్ కాన్సెప్ట్

బజాజ్ యూ కార్ ఉత్పత్తి గురించి కంపెనీ ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. ఈ మోడల్‌కు కస్టమర్ల నుంచి లభించే స్పందనను చూసిన తర్వాత, కంపెనీ దీనిపై నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 11, 2014, 16:40 [IST]
English summary
Bajaj Auto surprised everyone at the Auto Expo 2014 by showcasing a concept vehicle that it calls the ‘U Car'. Despite the word ‘car' in the name thought the U Car is not a car at all. At least Bajaj does not want us to think so.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+