భారత్‌లో బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్ విడుదల
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ 'బెంట్లీ' గడచిన సంవత్సరం జూన్ నెలలో ఆవిష్కరించిన 'కాంటినెంటల్ జిటి స్పీడ్' సూపర్ కారును తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. బెంట్లీ ఇదివరకెన్నడూ తయారు చేయని విధంగా, అత్యంత వేగంతో పరుగులు పెట్టేలా అభివృద్ధి చేసిన ఈ సరికొత్త కాంటినెంటల్ జిటి స్పీడ్ ఇప్పుడు దేశీయ విపణిలో లభ్యం కానుంది. భారత మార్కెట్లో ఈ లగ్జరీ కారు జస్ట్ రెండు కోట్ల రూపాయలు మాత్రమే. ఈ కారు గంటకు గరిష్టంగా 330 కిలోమీటర్ల (గంటకు 205 మైళ్లు) వేగంతో పరుగులు తీస్తుంది.
బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్ కారులో 6-లీటర్, 48-వాల్వ్, ఫోర్-క్యామ్, ట్విన్ టర్బోఛార్జ్‌డ్ డబ్ల్యూ12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 625 పిఎస్‌ల శక్తిని, 800 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను జెడ్ఎఫ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (8 గేర్లు కలిగిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్)తో జతచేయబడి ఉంటుంది. కనురెప్ప పాటులో ఇది ఆటోమేటిక్‌గా వేగాన్ని బట్టి గేర్ మార్చుకోగలదు. ఇది కేవలం 4.2 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్ కారులో ఉపయోగించిన ఈ కొత్త గేర్ బాక్స్ 12 శాతం అధికంగా మైలేజీనిచ్చేందుకు, తక్కువ కర్బన వ్యర్థాలను విడుదల చేసేందుకు సహకరిస్తుంది. బెంట్లీ కంపెనీ నుంచి 'కాంటినెంటల్ జిటి' మోడల్ కార్లు అత్యధికంగా అమ్ముడుపోతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా బెంట్లీ కార్లకు మంచి క్రేజ్ ఉంది. బోల్డ్ డిజైన్ కలిగి ఉండే బెంట్లీ కార్లు అధిక పెర్ఫామెన్స్ కలిగి ఉండటమే కాకుండా, మంచి విలాసవంతమైన ఫీచర్లు కలిగి ఉండి, సుఖవంతమైన లగ్జరీ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్

బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్

బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్

బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్

బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్

బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్

బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్

బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్



Click it and Unblock the Notifications








