బెంట్లీ మొట్టమొదటి ఎస్‌యూవీ పేరు 'బెంటైగా'

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీ మోటార్స్, మొట్టమొదటి సారిగా ఓ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. కాగా.. కంపెనీ ఇప్పుడు తమ తొలి ఎస్‌యూవీకి ఓ పేరును కూడా ఖరారు చేసింది. ఈ ఎస్‌యూవీ 'బెంట్లీ బెంటైగా' (Bentley Bentayga) అని పిలువనున్నారు.

గడచిన 2012 జెనీవా మోటార్ షోలో బెంట్లీ ఆవిష్కరించిన ఈఎక్స్‌‌పి 9 ఎఫ్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ మోడల్‌ను కంపెనీ దుబాయ్‌లోని ఎడారుల్లో టెస్టింగ్ చేస్తోంది. పూర్తి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు కలిగి ఉండేలా బెంట్లీ తమ ఎస్‌యూవీని తీర్చిదిద్దుతోంది.

Bentley First SUV Named As Bentayga

బెంటైగా ప్రపంచంలోని ఇతర కార్ల కన్నా మరింత ఉత్తమంగా ఉంటుందని, విలాసం మరియు పెర్ఫార్మెన్స్‌ల కలబోతే ఈ ఎస్‌యూవీ అని బెంట్లీ పేర్కొంది. ఈ ఏడాదిలో బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని పరిచయం చేయనున్నారు. కాగా.. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఇది కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.

కాగా.. బెంట్లీ డీలర్లు ఇప్పటికే తమ బెంటైగా ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకూ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీ కోసం 4000 ప్రీ-ఆర్డర్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఎస్‌యూవీ ధర ప్రస్తుతం తాము విక్రయిస్తున్న పెర్ఫార్మెన్స్ సెడాన్ ముల్సాన్ (3 లక్షల డాలర్లు) ధర కన్నా తక్కువగా ఉంటుందని బెంట్లీ తెలిపింది.

Most Read Articles

English summary
Bentley has announced the name of its first-ever SUV, to be revealed later this year. The new Bently SUV will be called as Bentayga.
Story first published: Tuesday, January 13, 2015, 10:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X