ఇంధన ధరలు పెరిగాయా.. అయితే డోంట్ వర్రీ..!
కొత్త కారు కొనడానికి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గురించి చింతిస్తున్నారా? అయితే, కంగారుపడకండి.. ఎక్కువ మైలేజీనిచ్చే కార్లతో పెరిగిన ఇంధన ధరల నుంచి ఉపశమనం పొందవచ్చు. మనదేశంలో లభ్యమవుతున్న అధిక మైలేజీనిచ్చే డీజిల్, పెట్రోల్ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
గడచిన కొద్ది నెలలుగా గమనిస్తే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెరిగిన ఇంధన ధరల కారణంగా వాహనాల అమ్మకాలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ఇందులో కొన్ని రకాల మోడళ్ల (ప్రత్యేకించి ఎక్కువ మైలేజీనిచ్చే కార్లు) అమ్మకాల జోరు మాత్రం బాగానే సాగుతోంది.
డాలర్ దెబ్బకు పెట్రోల్ ధర బాంబులా పేలుతుంటే, డీజిల్ ఇంధన ధరను ప్రతినెలా కాస్తంత పెంచడం ద్వారా, దీని విక్రయంపై పడుతున్న సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం ఈ భారం పూర్తిగా తొలగాలంటే, మరికొంత కాలం ఇలానే డీజిల్ ధరలను ప్రతినెలా పెంచక తప్పదు.
ఈ నేపథ్యంలో, కొనుగోలుదారులు ప్రధానంగా ధర కన్నా కూడా ఎక్కువగా మైలేజీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి భారత మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ ఫ్యూయెల్ ఎఫీషియంట్ (అన్ని మైలేజ్‌లు ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) కార్లేంటో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా అమేజ్ (డీజిల్)
ఇంజన్: 1.5 లీటర్ డీజిల్ ఇంజన్
మైలేజ్: 25.8 కెఎమ్‌పిఎల్

చెవర్లే బీట్ (డీజిల్)
ఇంజన్: 1.0 లీటర్ డీజిల్ ఇంజన్
మైలేజ్: 25.4 కెఎమ్‌పిఎల్

టాటా ఇండికా ఈవి2 (డీజిల్)
ఇంజన్: 1.4 లీటర్ డీజిల్ ఇంజన్
మైలేజ్: 25 కెఎమ్‌పిఎల్

నిస్సాన్ మైక్రా (డీజిల్)
ఇంజన్: 1.5 లీటర్ డీజిల్ ఇంజన్
మైలేజ్: 23.08 కెఎమ్‌పిఎల్

టొయోటా ఎతియోస్ లివా (డీజిల్)
ఇంజన్: 1.4 లీటర్ డీజిల్ ఇంజన్
మైలేజ్: 23.59 కెఎమ్‌పిఎల్

హ్యుందాయ్ వెర్నా (డీజిల్)
ఇంజన్: 1.4 లీటర్ డీజిల్ ఇంజన్
మైలేజ్: 23.05 కెఎమ్‌పిఎల్

మారుతి సుజుకి స్విఫ్ట్ (డీజిల్)
ఇంజన్: 1.3 లీటర్ డీజిల్ ఇంజన్
మైలేజ్: 22.9 కెఎమ్‌పిఎల్

హ్యుందాయ్ ఐ20 (డీజిల్)
ఇంజన్: 1.4 లీటర్ డీజిల్ ఇంజన్
మైలేజ్: 21.9 కెఎమ్‌పిఎల్

టాటా నానో
ఇంజన్: 624సీసీ పెట్రోల్ ఇంజన్
మైలేజ్: 25.4 కెఎమ్‌పిఎల్

మారుతి ఆల్టో 800
ఇంజన్: 800సీసీ పెట్రోల్ ఇంజన్
మైలేజ్: 22.74 కెఎమ్‌పిఎల్

హ్యుందాయ్ ఇయాన్
ఇంజన్: 814సీసీ పెట్రోల్ ఇంజన్
మైలేజ్: 21.10 కెఎమ్‌పిఎల్

హ్యుందాయ్ ఐ10
ఇంజన్: 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్
మైలేజ్: 20.36 కెఎమ్‌పిఎల్

మారుతి ఆల్టో కె10
ఇంజన్: 1000సీసీ పెట్రోల్ ఇంజన్
మైలేజ్: 20.20 కెఎమ్‌పిఎల్

మారుతి ఏ-స్టార్
ఇంజన్: 1000సీసీ పెట్రోల్ ఇంజన్
మైలేజ్: 19.0 కెఎమ్‌పిఎల్

మారుతి వ్యాగన్ఆర్
ఇంజన్: 1000సీసీ పెట్రోల్ ఇంజన్
మైలేజ్: 18.9 కెఎమ్‌పిఎల్


Click it and Unblock the Notifications








