భారత్‌లో మంచి మైలేజీనిచ్చే పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు
గడచిన కొద్ది నెలలుగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ తీరును గమనిస్తే, డీజిల్ కార్ల కన్నా పెట్రోల్ కార్లే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం డీజిల్ ఇంధన ధరలు ప్రతినెలా పెరుగుతూ ఉండటమే. డీజిల్ ఇంధన ధరను ప్రతినెలా కాస్తంత పెంచడం ద్వారా, దీని విక్రయంపై పడుతున్న సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం ఈ భారం పూర్తిగా తొలగాలంటే, మరికొంత కాలం ఇలానే డీజిల్ ధరలను ప్రతినెలా పెంచక తప్పదు.
ఈ నేపథ్యంలో, కొనుగోలుదారులు తమ ఆలోచనను మార్చుకొని, ఎక్కువ ఖరీదు చేసే డీజిల్ కార్లను కొనుగోలు చేయటానికి బదులుగా బడ్జెట్ ధరకే అందుబాటులో ఉండే పెట్రోల్ కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో డీజిల్ కార్ల అమ్మకాలు క్రమంగా తగ్గి పెట్రోల్ కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ కార్లలో కూడా ప్రధానంగా ఎక్కువ మైలేజీనిచ్చే కాంపాక్ట్ కార్లకే కొనుగోలుదారులు అధిక ప్రాధాన్య ఇస్తున్నారు.
మరి భారత మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ ఫ్యూయెల్ ఎఫీషియంట్ పెట్రోల్ కార్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

టాటా నానో
- సర్టిఫై చేసిన మైలేజ్: 25.4 కెఎమ్‌పిఎల్
- ధరల శ్రేణి: రూ.1.54 లక్షలు - రూ.2.18 లక్షలు
- సర్టిఫై చేసిన మైలేజ్: 22.74 కెఎమ్‌పిఎల్
- ధరల శ్రేణి: రూ.2.78 లక్షలు - రూ.3.56 లక్షలు
- సర్టిఫై చేసిన మైలేజ్: 21.10 కెఎమ్‌పిఎల్
- ధరల శ్రేణి: రూ.2.86 లక్షలు - రూ.3.87 లక్షలు
- సర్టిఫై చేసిన మైలేజ్: 20.36 కెఎమ్‌పిఎల్
- ధరల శ్రేణి: రూ.3.76 లక్షలు - రూ.6.21 లక్షలు
- సర్టిఫై చేసిన మైలేజ్: 20.20 కెఎమ్‌పిఎల్
- ధరల శ్రేణి: రూ.3.21 లక్షలు - రూ.3.34 లక్షలు
- సర్టిఫై చేసిన మైలేజ్: 19.0 కెఎమ్‌పిఎల్
- ధరల శ్రేణి: రూ.3.81 లక్షలు - రూ.4.66 లక్షలు
- సర్టిఫై చేసిన మైలేజ్: 18.9 కెఎమ్‌పిఎల్
- ధరల శ్రేణి: రూ.3.58 లక్షలు - రూ.4.45 లక్షలు

మారుతి ఆల్టో 800

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఐ10

మారుతి ఆల్టో కె10

మారుతి ఏ-స్టార్

మారుతి వ్యాగన్ఆర్

పెట్రోల్ కార్లు
గమనిక: ఇందులో పేర్కొన్న మైలేజ్ గణాంకాలు స్డాండర్డ్ రైడింగ్ కండిషన్స్‌కు లోబడి ఏర్ఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, కంపెనీలు ప్రకటించినవి. అలాగే, ఇందులో పేర్కొన్న వాహనాల ధరల శ్రేణి ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు.


Click it and Unblock the Notifications








