బిఎమ్‌డబ్ల్యూ నుంచి అత్యంత చవక కారు '1 సిరీస్' విడుదల
వివిధ ప్రచార కార్యక్రమాలు, సోషల్ మీడియా క్యాంపైన్ల తర్వాత జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ భారత మార్కెట్లో కెల్లా అత్యంత చవకైన లగ్జరీ కారు '1 సిరీస్' ను నేడు (సెప్టెంబర్ 3, 2013న) విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ (BMW 1 Series) లగ్జరీ కారును బిఎమ్‌డబ్ల్యూ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ దేశీయ విపణిలో విడుదల చేశారు.
బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నుంచి భారత మార్కెట్లో లభిస్తున్న ఉత్పత్తులలో కెల్లా 1 సిరీస్ కారు అత్యంత చవకైనది. దేశీయ విపణిలో ఈ కారు ప్రారంభ ధర రూ.20.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ కాంపాక్ట్ లగ్జరీ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ధరలు వేరియంట్లు
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది.
116ఐ బేస్ వేరియంట్ (పెట్రోల్): రూ.20.9 లక్షలు
118డి (డీజిల్): రూ.22.9 లక్షలు
118డి స్పోర్ట్ లైన్ (డీజిల్): రూ.25.9 లక్షలు
118d స్పోర్ట్ ప్లస్ (డీజిల్): రూ.29.9 లక్షలు

ఇంజన్ అండ్ ట్రాన్సిమిషన్స్
పెట్రోల్ ఇంజన్
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.6 లీటర్ టర్బో యూనిట్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 136 హార్స్ పవర్‌ల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ జెడ్‌టి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

పెట్రోల్ ఇంజన్ మైలేజ్
పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ లీటరుకు 16.28 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ ఇంజన్
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ డీజిల్ వెర్షన్‌లో 2.0 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 143 హార్స్ పవర్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ జెడ్‌టి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

పెట్రోల్ ఇంజన్ మైలేజ్
పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ లీటరుకు 16.28 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

నాలుగు డ్రైవింగ్ మోడ్స్
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ నాలుగు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. అవి కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, ఈకో ప్రో మోడ్స్.

కంఫర్ట్ మోడ్
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ కారులో రోజూవారీ ప్రయాణం కోసం కంఫర్ట్ డ్రైవింగ్ మోడ్‌ను ఎంచుకోవచ్చు.

ఈకో మోడ్
మైలేజ్‌ను పెంచుకునేందుకు గాను బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ కారులో ఈకో మోడ్‌ను ఎంచుకోవచ్చు.

స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ మోడ్స్
సిటీ రోడ్లపై కాకుండా ఆఫ్-రోడ్ వంటి ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు సౌకర్యవంతమైన సస్పెన్షన్ కోసం ఈ రెండు మోడ్స్‌ను ఎంచుకోవచ్చు.

116ఐ పెట్రోల్ వేరియంట్ ఫీచర్స్
ఈ వేరియంట్లో ఫాగ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఏబిఎస్, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, స్టార్ట్/స్టాప్ ఫంక్షన్స్, ఈకో మోడ్, బిఎమ్‌డబ్ల్యూ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్, ఫ్లాట్ టైర్లు స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి.

118డి స్పోర్ట్ లైన్ డీజిల్ వేరియంట్ ఫీచర్స్
ఈ వేరియంట్లో పెట్రోల్ వేరియంట్లో పేర్కొన్న ఫీచర్లకు అదనంగా, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్టర్ (మెమరీ ఫంక్షన్‌తో), బిఎమ్‌డబ్ల్యూ ఐడ్రైవ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కంట్రోలర్, హ్యాండ్స్ ఫ్రీ కంట్రోల్ ఫెసిలిటీ, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ ఫీచర్లతో లభిస్తాయి.

118డి స్పోర్ట్ ప్లస్ డీజిల్ వేరియంట్ ఫీచర్స్
ఇది టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో కీలెస్ ఇగ్నిషన్, రియర్ ఏసి వెంట్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సన్‌రూఫ్ ఫీచర్లు లభిస్తాయి.

కాంపిటీషన్
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బి-క్లాస్, ఆడి క్యూ3 వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లతో పోటీగా నిలుస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ఒక హ్యాచ్‌బ్యాక్, కానీ చూడటానికి క్రాసోవర్ మాదిరిగా ఉంటుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారు కన్నా మరింత విశాలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








