భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ఎమ్ ఎడిషన్ విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మరో సరికొత్త ఎంట్రీ లెవల్ పెర్ఫార్మెన్స్ లగ్జరీ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎమ్ (M) పెర్ఫార్మెన్స్ ప్యాకేజ్‌తో కూడిన బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ఎమ్ ఎడిషన్ (BMW 1-Series M Edition)ను కంపెనీ విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: మంచి మైలేజీనిచ్చే పెట్రోల్ కార్లు

పరిమిత కాలం మాత్రమే బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ఎమ్ ఎడిషన్ లభిస్తుందని, కేవలం 111 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇంప్రూవ్డ్ ఏరోడైనమిక్ ప్యాకేజ్‌తో కొడ్డ 1-సిరీస్ ఎమ్ పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌ను ఆఫర్ చేస్తున్నారు.


ఈ ఏరోడైనమిక్ ప్యాకేజ్‌లో స్పాయిలర్ విత్ ఫిన్స్, రేసింగ్ స్ట్రైప్స్, బ్లాక్ కలర్ ఫ్రంట్ గ్రిల్, ఎమ్ పెర్ఫార్మెన్స్ బ్యాడ్జ్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఇందులో చూడొచ్చు. ఇలాంటిది మీకూ ఓ కారు కావాలనుకుంటే మీరు జులై 25, 2014 లోపుగా దీనిని బుక్ చేసుకోవాలి.

బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ఎమ్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.6 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 136 హెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

BMW 1 Series M Edition Launched In India

డీజిల్ వెర్షన్‌లో 2.0 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 143 హెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.6 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

సెప్టెంబర్ 2013లో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తొలిసారిగా తమ 1-సిరీస్ మోడల్‌ను విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్‌కు పోటీగా దీనిని ప్రవేశపెట్టారు. అయితే, మెర్సిడెస్ బెంజ్ ఇటీవల తమ ఏ-క్లాస్‌లో ఎడిషన్ 1 మోడల్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, బిఎమ్‌డబ్ల్యూ కూడా ఈ 1-సిరీస్ ఎమ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం.

ఈ వీడియో చూశారా..? బికినీ బేబ్స్‌తో కెన్ బ్లాక్ జిమ్ఖానా!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/rMSL4WKT5Uc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, July 21, 2014, 11:42 [IST]
English summary
German luxury car manufacturer BMW has launched its smallest offering in India with a M performance package. The performance package will be available in India for a limited period of time. Only 111 BMW 1-Series, with M performance package will be available in India.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+