హైదరాబాద్‌లో బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ తురిస్మో విడుదల

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త '3 సిరీస్ జిటి' (గ్రాన్ తురిస్మో) కారును తాజాగా రాష్ట్ర విపణిలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి కారు ధర రూ.42.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సీరీస్‌ గ్రాన్‌ తురిస్మో కారును చెన్నైకి సమీపంలోని మహీంద్రా వరల్డ్ సిటీ సింగపూర్‌ కోయిల్‌ వద్ద ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఉత్పత్తి కేంద్రంలో తయారు చేస్తున్నారు.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో, ఫోర్ సిలిండర్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 7.9 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 226 కి.మీ.

BMW 3 Series Gran Turismo Launched In Hyderabad

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి దాని సెడాన్ వెర్షన్ కన్నా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. సెడాన్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఇది 200 మి.మీ. పొడవును, 50 మి.మీ. ఎత్తును, 17 మి.మీ. వెడల్పును కలిగి ఉంటుంది. అంటే ఇది బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కాంపాక్ట్ ఎస్‌యూవీ కన్నా విశాలంగా ఉంటుందన్నమాట.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి బూట్ డోర్ స్కొడా ర్యాపిడ్ స్పేస్‌బ్యాక్ మాదిరిగా ఓపెన్ అవుతుంది. అంటే, ఇందులోని వెనుక అద్దం (రియర్ విండ్‌షీల్డ్) కూడా బూట్ డోరుకే అమర్చబడి ఉంటుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, వెనుక బంపర్ క్రింద కాలును గాలిలో ఊపితే చాలు బూట్ డోర్ తెరచుకుంటుంది.

BMW 3 Series GT

బ్రాడ్ రియర్ ఎండ్ కలిగిన జిటి వెర్షన్ కొంచెం బోల్డ్‌గా కనిపిస్తుంది, సెడాన్‌ను ఉపయోగించేవారు దీనికి అలవాటు పడాల్సి ఉంటుంది. 3 సిరీస్ జిటి సెడాన్‌తో పోల్చుకుంటే మంచి కంఫర్ట్ రైడ్‌ను అందిస్తుంది. ఇక ఇంటీరియర్ ఎక్విప్‌మెంట్స్ విషయానికి వస్తే, 3 సిరీస్ సెడాన్లో లభ్యమవుతున్న అన్ని రకాలు ఫీచర్లు కూడా ఇందులో లభ్యం కానున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇప్పటికే భారత మార్కెట్లో 5 సిరీస్ జిటి కారును అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 26, 2014, 9:17 [IST]
English summary
BMW India has launched its all new 3 Series Gran Turismo in Hyderabad. This car will be locally manufactured and will attract a price of Rs. 42.75 lakhs (Ex-showroom, Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+