త్వరలో భారత్‌కు రానున్న బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ నుంచి భారత మార్కెట్‌కు మరొక కొత్త కారు రాబోతుంది. తమ చిన్న జిటి కార్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి (BMW 3 Series GT)ని కంపెనీ త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనుంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇప్పటికే భారత మార్కెట్లో 5 సిరీస్ జిటి కారును అందిస్తోంది.
తాజాగా రానున్న ఈ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి తక్కువ ధరకే ఎస్‌యూవీలోని స్పేస్‌ను, సెడాన్‌లోని ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది 5 సిరీస్ జిటి కన్నా అత్యధికంగా అమ్ముడుపోతుందని అంచనా. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి విడుదల సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇధి ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి కారును కంపెనీ అందిస్తున్న 3 సిరీస్ సెడాన్, 5 సిరీస్ సెడాన్లకు మధ్యలో ప్రవేశపెట్టనున్నారు. దీని ధర ఈ కారును దిగుమతి చేసుకోవటం లేదా స్థానికంగా అసెంబ్లింగ్ చేయటం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

అంతర్జాతీయంగా బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి ఐదు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. అయితే, భారత్‌లో కేవలం డీజిల్ వెర్షన్లో రెండు వేరియంట్లలో మాత్రమే విడుదలయ్యే అవకాశాలున్నాయి. అందులో 184 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 2 లీటర్ ఇంజన్ కాగా మరొకటి 254 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 3 లీటర్ ఇంజన్. ఈ ఇంజన్లను 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి దాని సెడాన్ వెర్షన్ కన్నా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. సెడాన్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఇది 200 మి.మీ. పొడవును, 50 మి.మీ. ఎత్తును, 17 మి.మీ. వెడల్పును కలిగి ఉంటుంది. అంటే ఇది బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కాంపాక్ట్ ఎస్‌యూవీ కన్నా విశాలంగా ఉంటుందన్నమాట.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి బూట్ డోర్ స్కొడా ర్యాపిడ్ స్పేస్‌బ్యాక్ మాదిరిగా ఓపెన్ అవుతుంది. అంటే, ఇందులోని వెనుక అద్దం కూడా బూట్ డోరుకే అమర్చబడి ఉంటుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, వెనుక బంపర్ క్రింద కాలును గాలిలో ఊపితే చాలు బూట్ డోర్ తెరచుకుంటుంది.

బ్రాడ్ రియర్ ఎండ్ కలిగిన జిటి వెర్షన్ కొంచెం బోల్డ్‌గా కనిపిస్తుంది, సెడాన్‌ను ఉపయోగించేవారు దీనికి అలవాటు పడాల్సి ఉంటుంది. 3 సిరీస్ జిటి సెడాన్‌తో పోల్చుకుంటే మంచి కంఫర్ట్ రైడ్‌ను అందిస్తుంది.

ఇక ఇంటీరియర్ ఎక్విప్‌మెంట్స్ విషయానికి వస్తే, 3 సిరీస్ సెడాన్లో లభ్యమవుతున్న అన్ని రకాలు ఫీచర్లు కూడా ఇందులో లభ్యం కానున్నాయి.


Click it and Unblock the Notifications








