బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ యాక్టివ్ హైబ్రిడ్ విడుదల; ధర రూ.1.35 కోట్లు

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నేడు (జులై 23, 2014) తమ సరికొత్త హైబ్రిడ్ కారు 'బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ యాక్టివ్‌‌హైబ్రిడ్'ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ హైబ్రిడ్ కారు ధరను రూ.1.35 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఈ మోడల్‌ను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.

ఇది కూడా చదవండి: మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ 45 ఏఎంజి విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ యాక్టివ్ హైబ్రిడ్ కారులో 3.0 లీటర్ ఇన్‌లైన్-6 ఇంజన్‌‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 320 బిహెచ్‌పిల శక్తిని, 450 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 బిహెచ్‌పిల శక్తిని, 210 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ పేర్కొంది.

BMW 7 series ActiveHybrid Launched

ఈ కారులో జెడ్ఎఫ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌ను ఉపయోగించారు. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తిని ఈ గేర్‌బాక్స్ వెనుక చక్రాలకు బదిలీ చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇది ఈ సెగ్మెంట్లోని టొయోటా ప్రియస్, క్యామ్రీ హైబ్రిడ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

ఈ వీడియో చూశారా..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/AFtUpMTs4vI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, July 23, 2014, 16:57 [IST]
English summary
German luxury automobile manufacturer BMW has launched its 7-Series ActiveHybrid at the priceof INR 1.35 crore. The vehicle will be identical to the regular 7-Series, only with a hybrid system.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+