అప్‌గ్రేడెడ్ బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ విడుదల: ధర, ఇతర వివరాలు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 'బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్' నేడు (ఏప్రిల్ 25, 2013) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ (730 ఎల్‌డి వేరియంట్) ప్రారంభ ధర రూ.92.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర‌)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. గడచిన నెలలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 7 సిరీస్ లగ్జరీ కారును ఓ ఛారిటీ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

దేశీయ విపణిలో 2013 బిఎమ్‌‌డబ్ల్యూ 7 సిరీస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. వాటి వేరియంట్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • బిఎమ్‌‌డబ్ల్యూ 730ఎల్‌డి - రూ. 92.90 లక్షలు
  • బిఎమ్‌‌డబ్ల్యూ 740ఎల్‌ఐ - రూ. 1.12 కోట్లు
  • బిఎమ్‌‌డబ్ల్యూ 750ఎల్‌ఐ - రూ. 1.29 కోట్లు
  • బిఎమ్‌‌డబ్ల్యూ 760ఎల్‌ఐ - రూ. 1.73 కోట్లు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)

BMW 7 Series Facelift Launched

సరికొత్త 2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారులో రివైజ్డ్ ఫ్రంట్ డిజైన్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, మరింత అప్‌రైట్ కిడ్నీ గ్రిల్, ఫుల్ అడాప్టివ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, బూట్‌లిడ్‌పై క్రోమ్ స్ట్రిప్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్లను కూడా అప్‌డేట్ చేయటం జరిగింది. ఈ కొత్త వేరియంట్లలో ఇది వరకటి ఇంజన్లనే రీట్యూన్ చేసి ఉపయోగించారు. ఈ ఇంజన్ల సామర్థ్యాలలో స్వల్పంగా మార్పులు ఉన్నాయి. 2013 బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ డీజిల్ ఇంజన్ సామర్థ్యాన్ని స్వల్పంగా పెంచగా, పెట్రోల్ వెర్షన్ మైలేజీని 21 శాతం మెరుగుపరచినట్లు కంపెనీ పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (8 ఆటోమేటిక్ గేర్లు)తో లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Thursday, April 25, 2013, 15:23 [IST]
English summary
German luxury carmaker BMW India has launched the facelift 7 Series in India with the starting price of INR 92.90 lakhs. The updated BMW 730Ld would be locally assembled at BMW’s plant in Chennai and Petrol variants would be brought in as complete built units (CBU).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+