భారత్‌లో విఐపిల కోసం బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ విడుదల
భారతదేశంలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, విఐపిల కోసం ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందిస్తున్న నేపథ్యంలో, తాజాగా మరో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ కూడా విఐపిల భద్రత కోసం ఓ హై సెక్యూరిటీ కారును విడుదల చేసింది. అదే బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ (BMW 7-Series High Security).
ఇప్పటి మనదేశ ప్రధానమంత్రి ఉపయోగిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ మోడల్‌ను దేశంలోని ఇతర విఐపిల కోసం కూడా బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తమ ఎమ్-గార్డ్ (Mercedes Benz M-Guard) అనే బుల్లెట్ ప్రూఫ్ కారును విక్రయిస్తుంటే, ఆడి తమ ఏ8 సెక్యురిటీ (Audi A8 Security) కారును విక్రయిస్తోంది.
మరి బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తాజాగా ప్రవేశపెట్టిన తమ 7-సిరీస్ హైసెక్యూరిటీ విఐపిలకు ఎంత మాత్రం సెక్యూరిటీని అందిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ హై సెక్యురిటీ కారును ధృడమైన స్టీల్‌తో తయారు చేస్తారు. రెగ్యులర్ 7-సిరీస్ కారుకు అదనంగా బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ ప్లేట్లను జోడించి దీనిని తయారు చేస్తారు. అదనపు స్టీల్ వలన కారు బరువు భారీగా పెరుగుతుంది కాబట్టి, ఛాస్సిస్, సస్పెన్షన్, ఇంజన్ పెర్ఫార్మెన్స్ వంటి పలు విషయాల్లో దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారు.

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ కార్లు తుపాకీ బుల్లెట్ దాడులు, బాంబు దాడులను సమర్థవంతంగా తట్టుకుని కారు లోపల ఉండే వారికి అన్ని వైపుల నుంచి రక్షణను ఇస్తాయి. ఈ కార్లలో అధునాతన సాంకేతిక వ్యవస్థ, అలారమ్ సిస్టమ్‌లు ఉంటాయి. టైర్లు పంక్చర్ అయినా సరే ఇవి ఫ్లాట్ టైర్లపై కూడా మైళ్ల దూరం పరుగులు తీయగలవు.

కారు క్రింది భాగంలో పేలుడు సంభవించినా ఫ్యూయెల్ ట్యాంక్ పేలిపోకుండా ఉండేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. బాంబులు, మిస్సైళ్లను గుర్తించేందుకు ఇందులో అధునాతన హీట్ సెన్సార్లు ఉంటాయి. కారులో క్యాబిన్ గ్యాస్ ప్రూఫ్ చాంబర్‌గా ఉంటుంది. రసాయన, గ్యాస్ దాడుల నుంచి ఇది క్యాబిన్‌లోని ప్రయాణీకులను రక్షిస్తుంది.

ఈ ఆర్మోర్డ్ 'బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 760ఎల్ఐ హై సెక్యూరిటీ ఎడిషన్' చూడటానికి రెగ్యులర్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 745ఎల్ఐ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. విఐపిలు ఉపయోగించే ప్రపంచంలో కెల్లా హై సెక్యురిటీ వాహనాల్లో ఈ 760ఎల్ఐ హై సెక్యూరిటీ మోడల్ కూడా ఒకటి. ఇది క్లాస్ బి6/బి7 బల్లిస్టిక్ ప్రొటెక్షన్‌ను (భద్రతా ప్రమాణాల్లో అత్యున్నతమైనది) ఆఫర్ చేస్తుంది.

ఈ వాహనాలను సాధారణ డ్రైవర్లు ఆపరేట్ చేయలేరు. ఇందుకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. అందుకే బిఎమ్‌డబ్ల్యూ తమ 'ట్రైనింగ్ ఫర్ ప్రొఫెషనల్స్' కోర్స్ క్రింది వీరికి శిక్షణ ఇస్తుంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా స్పందించాలో, కారులోని ఫీచర్లను ఎలా ఆపరేట్ చేయాలో వారికి తెలియజేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 760ఎల్ఐ హై సెక్యూరిటీ కారులో 6.0 లీటర్, వి-12, 439 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది (రియల్ వీల్ డ్రైవ్). ఈ కారు కేవలం 7.5 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

ఇది కూడా చదవండి: మరిన్ని హైసెక్యూరిటీ వాహనాలు


Click it and Unblock the Notifications








