బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ సిగ్నేచర్ ఎడిషన్ విడుదల; ధర రూ.1.22 కోట్లు

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, దేశీయ విపణిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టిన తమ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 'బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్'లో కంపెనీ తాజాగా ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ సిగ్నేచర్ ఎడిషన్ పేరిట కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: ఆడి ఏ3 లగ్జరీ కార్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ సిగ్నేచర్ ఎడిషన్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ లగ్జరీ కారును ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సునీత్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ ఏడాది నిర్వహించిన 6వ సీజన్ 'బిఎమ్‌డబ్ల్యూ ఫ్యాషన్ షో' కార్యక్రమంలో ఈ కారును విడుదల చేశారు. భారత విపణిలో బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ సిగ్నేచర్ ఎడిషన్ ధర రూ.1.22 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

BMW 7 Series Signature Edition

రెగ్యులర్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారుతో పోల్చుకుంటే ఈ సిగ్నేచర్ ఎడిషన్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారులో బ్యాంగ్ అండ్ ఓల్యుఫ్సెన్ హై-ఎండ్ సరౌండ్ ఆడియో సిస్టమ్, ఇంటిగ్రల్ యాక్టివ్ స్టీరింగ్, ఎక్స్టెండెడ్ వుడ్ ట్రిమ్, ఎక్స్‌క్లూజివ్ నప్పా లెథర్ సీట్స్, బిఎమ్‌డబ్ల్యూ ఇండివిడ్యువల్ రియర్ రీడింగ్ లైట్స్, పానీయాలను చల్లగా ఉంచే చిల్డ్ బాక్స్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి.

ఇది కూడా చదవండి: BMW 1-సిరీస్ ఎమ్ పెర్ఫార్మెన్స్ ఎడిషన్ విడుదల

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ సిగ్నేచర్ ఎడిషన్‌లో అధనపు ఫీచర్లు డిజైన్ పరంగా కానీ లేదా ఇంజన్ పరంగా కానీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 3.0 లీటర్ స్ట్రైట్-సిక్స్ డీజిల్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఇది ఇంపీరియల్ బ్లూ బ్రిలియంట్ ఎఫెక్ట్ మరియు మినరల్ వైట్ రెండు మెటాలిక్ కలర్స్‌లో లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 13, 2014, 11:18 [IST]
English summary
BMW India has launched a special edition of its 7-series sedan. Named as BMW 7-series Signature, it gets some minor cosmetic updates, added kit and trims on the inside. The BMW 7 Series Signature edition, which has been launched by Indian fashion designer Suneet Varma at the exclusive 6th 'BMW Fashion Show'.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+