జులై 2014 నుంచి బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు డెలివరీలు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన తమ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు డెలివరీలను కస్టమర్లకు వచ్చే జూన్ నెల నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ఈ హైటెక్ స్పోర్ట్స్ కారును ధృడమైన కార్బన్ బాడీతో తయారు చేశారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆకర్షనీయమైన లుక్, సరికొత్త స్టయిల్‌తో డిజైన్ చేసిన ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును తయారు చేశారు. బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారులో ఓ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ ద్వారా రియర్ యాక్సిల్ (వెనుక చక్రాల)‌కు పవర్‌ను చేరవేస్తుంది.


అలాగే, ఇందులో అమర్చిన 125 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రంట్ యాక్సిల్ (ముందు చక్రాల)కు పవర్‌ను చేరవేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును పూర్తిగా పెట్రోల్ ఇంజన్‌తో కానీ లేదా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో కానీ లేదా రెండింటిని కలిపి ఒకేసారిగా కానీ ఉపయోగించి డ్రైవ్ చేయవచ్చు. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కలిపి మొత్తం 349 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ భవిష్యత్తులో తయారు చేయనున్న అన్ని ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల యొక్క డ్రైవ్ టెక్నాలజీ కోసం "ఈ-డ్రైవ్" (eDrive)ను ఉపయోగిస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారులో కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగించారు.

BMW i8

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే (బహుశా 7 లేదా 8 యూనిట్లు) లభ్యం కానుంది.మయ్యే ఆస్కారం ఉంది. ఈ మోడల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో, దీని ధరకు అంచనాలకు మించి ఉండొచ్చని (సుమారు రూ.1.5 కోట్లు) తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/-6UssR2-NcI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, March 11, 2014, 11:35 [IST]
English summary
BMW has showcased their i8 hybrid plug-in sports car. The German car manufacturer confirms they will start distributing BMW i8 to dealers by 2014 June.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+