బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కార్ విడుదల: ధర, ఫీచర్లు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ, గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన తమ హైబ్రిడ్ స్పోర్ట్స్ కార్ 'బిఎమ్‌డబ్ల్యూ ఐ8' (BMW i8)ను కంపెనీ నేడు (ఫిబ్రవరి 18, 2015) భారత మార్కెట్లో విడుదల చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కారును విడుదల చేశారు.

ముంబైలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్ టెండూల్కర్ ఐ8 కారును విడుదల చేశారు. ముంబై, చెన్నై, న్యూఢిల్లీలలోని బిఎమ్‌డబ్ల్యూ ఐ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ మోడల్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తారు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 ఒక పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే హైటెక్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు. ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును ధృడమైన కార్బన్ బాడీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆకర్షనీయమైన లుక్, సరికొత్త స్టయిల్‌తో డిజైన్ చేశారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 విడుదల

తర్వాతి స్లైడ్‌లలో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారులో ఓ పెట్రోల్ ఇంజన్, ఓ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇందులోని 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పవర్‌ను డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ రియర్ యాక్సిల్ (వెనుక చక్రాల)‌కు చేరవేస్తుంది. అలాగే, ఇందులో అమర్చిన 125 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రంట్ యాక్సిల్ (ముందు చక్రాల)కు పవర్‌ను చేరవేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 విడుదల

ఈ కారులోని పెట్రోల్ ఇంజన్ ఇంజన్ 231 హెచ్‌పిల శక్తిని, ఎలక్ట్రిక్ మోటార్ 131 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కలిసి మొత్తం గరిష్టంగా 362 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు కేవలం 4.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారులో 'ఈ-డ్రైవ్' (eDrive) అనే టెక్నాలజీని ఉపయోగించారు. భవిష్యత్తులో తాము తయారు చేయనున్న అన్ని ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగించాలని బిఎమ్‌డబ్ల్యూ భావిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ తమ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును పూర్తిగా కార్బన్ ఫైబర్ బాడీతో తయారు చేసింది. అయినప్పటికీ, ఇందులోని భారీ బ్యాటరీ ప్యాక్ కారణంగా ఇది మొత్తం 1490 కిలోల బరువును కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారులో 'ఈ-డ్రైవ్' (eDrive) అనే టెక్నాలజీని ఉపయోగించారు. భవిష్యత్తులో తాము తయారు చేయనున్న అన్ని ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగించాలని బిఎమ్‌డబ్ల్యూ భావిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 విడుదల

భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ధర రూ.2.29 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 18, 2015, 13:12 [IST]
English summary
The BMW i8 has been launched in India. This plug in hybrid sports car from the German manufacturer has been a very anticipated launch. The BMW i8 is priced at INR 2.29 crore (ex-showroom all-India).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+