సరికొత్త మినీ కూపర్ విడుదల; ధర రూ.31.85 లక్షలు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ 'మినీ' (MINI), భారత మార్కెట్లో తమ మూడవ తరం (థర్డ్ జనరేషన్) మోడల్‌ను విడుదల చేసింది. కొత్త మినీ కూపర్ రెండు బాడీ టైప్‌లలో లభ్యం కానుంది.
వాటిలో ఒకటి 3-డోర్ వెర్షన్, మరొకటి 5-డోర్ వెర్షన్. మినీ కూపర్ ఇప్పటి వరకూ 3-డోర్ ఆప్షన్‌తో లభ్యమయ్యేది. ఇందులో మొట్టమొదటి సారిగా 5-డోర్ వెర్షన్‌ను భారత్‌కు పరిచయం చేశారు. దేశీయ విపణిలో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
ధరలు:
- మినీ కూపర్ డి (3-డోర్): రూ.31.85 లక్షలు
- మినీ కూపర్ డి (5-డోర్): రూ.35.20 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

ఈ థర్డ్ జనరేషన్ మినీ కూపర్ ఇదివరకటి మోడల్‌తో పోల్చుకుంటే మరింత పెద్దగా, విశాలంగా ఉంటుంది. ఈ ఏడాది జరిగిన ప్యారిస్ మోటార్ షో తొలిసారిగా ఈ కారును ఆవిష్కరించారు. భారత మార్కెట్లో మినీ కూపర్ డి ప్రస్తుతానికి డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో పెట్రోల్ వెర్షన్ అందుబాటులో లేదు.
ఇంజన్, పెర్ఫార్మెన్స్:
మినీ కూపర్ డి కారులో ఉపయోగించిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పిల శక్తిని, 269 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రలాకు బదిలీ అవుతుంది. ఇది 9.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు.

మినీ కూపర్ డి డిజైన్:
- రీడిజైన్డ్ గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్
- బ్లాక్ హనీకోంబ్ గ్రిల్ ప్యాటర్న్ (కూపల్ ఎస్ మాత్రమే)
- రియర్ ఎయిర్ అవుట్‌లెట్, ఫాగ్ ల్యాంప్స్
- ఎస్ బ్యాడ్జింగ్ (కూపర్ ఎస్ మాత్రమే)
- రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్స్ (ఫుల్ ఎల్ఈడి లైట్స్ ఆప్షనల్)

- రీవ్యాంప్డ్ డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో స్పీడో/టాక్ మీటర్స్
- సరికొత్త మినీ సెంట్రల్ డిస్‌ప్లే
- పెంచబడిన ఇంటీరియర్ స్పేస్
- ఫోల్డబిల్ బ్యాక్‌రెస్ట్ విత్ టిల్ట్ అడ్జస్టబిలిటీ
- బ్లూటూత్ హ్యాండ్స్‌ఫ్రీ ఇంటర్‌ఫేస్
- ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్

- డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్
- బ్రేక్ అసిస్ట్
- క్రాష్ సెన్సార్
- ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
- డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్‌సి)



Click it and Unblock the Notifications








