ఆగస్ట్ 28న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఫేస్‌లిఫ్ట్ విడుదల
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీలో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఈనెల 28న మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014 జెనీవా మోటార్ షోలో బిఎమ్‌డబ్ల్యూ తొలిసారిగా తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎక్స్3 ఎస్‌యూవీని ఆవిష్కరించింది.
మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అందుకున్న ఈ కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. ఈ కారును ఆగస్ట్ 28, 2014వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.

ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అనేక డిజైన్ మార్పులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బిఎమ్‌డబ్ల్యూ కిడ్నీ గ్రిల్ నుంచి ప్రారంభమయ్యే ట్విన్ సర్క్యులర్ హెడ్‌లైట్స్, రివైజ్డ్ బంపర్స్, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌తో ఇది సరికొత్త లుక్ అండ్ ఫీల్‌నిస్తుంది.
ఇంటీరియర్స్‌లో గ్లాసీ ఫినిష్‌తో కూడిన సెంటర్ కన్సోల్, కొత్త లెథర్ సీట్స్ ఇదివరకటి కన్నా మెరుగ్గా అనిపిస్తాయి. ఈ కారు ఓవరాల్ డిజైన్ అండ్ డైమన్షన్స్ మాత్రం మారకుండా అలానే ఉంది.

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది 2.0 లీటర్ మరియు 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్ ఇంజన్‌ను మరింత ఎక్కువ పవర్‌ను ఆఫర్ చేసేలా అప్‌ట్యూన్ చేశారు (ప్రస్తుతం ఇది 184 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తిని చేస్తుంది).
కాగా.. 3.0 లీటర్ ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా బిఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంటులోనే అసెంబ్లింగ్ చేయనున్నారు. ఈ కారుకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








