ఫిబ్రవరి 14న విడుదల కానున్న 2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్రేమికుల రోజున తమ సరికొత్త అప్‌గ్రేడెడ్ ఎక్స్1 ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కారుతో పోల్చుకుంటే డిజైన్, ఫీచర్ల పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా అభివృద్ధి చేసిన 2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కారును కంపెనీ ఈ నెల 14న (ఫిబ్రవరి 14, 2013) మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ నుంచి లభిస్తున్న అతి చవకైన కారు (ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు) ఇదే.
కొత్త 2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కారులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, సిల్వర్ ఫినిష్ కిడ్నీ గ్రిల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌లైట్స్ వంటి కాస్మోటిక్ మార్పులను అలాగే ఇంటీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులను గమనించవచ్చు. కాగా.. యాంత్రిక పరంగా ఇందులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం లభిస్తున్న ఎక్స్1లోని ఇంజన్‌లనే ఇందులోను ఉపయోగించనున్నారు. కొత్త ఎక్స్1 ఈకో ప్రో మోడ్, ఆటో స్టార్ట్ స్టాప్‌లు స్టాండర్డ్ ఫీచర్లుగా లభ్యం కానున్నాయి.
ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని, మరింత ప్రీమియం ఫీల్‌ను అందించేలా దీని ఇంటీరియర్లను తీర్చిదిద్దారు. బ్లూటూత్ హ్యాండ్స్ ఫ్రీ ఫంక్షనాలిటీ, యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో లభ్యం కానుంది. ఈ మోడల్‍కు సమీప పోటీదారు అయిన ఆడి క్యూ3 ఎస్‌యూవీకి గట్టి సవాలును విసిరేలా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మార్కెట్లోకి రానుంది. ఇక దీని ధర విషయానికి వస్తే, ప్రస్తుతం లభిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కన్నా కాస్తంత అధికంగానే ఉండొచ్చని తెలుస్తోంది.

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1



Click it and Unblock the Notifications








