భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3, ఎమ్4 కూపే విడుదల

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, దేశీయ విపణిలో రెండు కొత్త పవర్‌ఫుల్ కార్లను విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3, బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 మోడళ్లను కంపెనీ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఈ పవర్‌ఫుల్ కార్లను గ్రేటర్ నోయిడాలో ఉన్న బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద విడుదల చేశారు.

ధరలు:

  • బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 - రూ.1.19 కోట్లు
  • బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 - రూ.1.21 కోట్లు

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్‌లలో ఈ కార్లు లభ్యం కానున్నాయి.

bmw m3 and m4 launch by sachin tendulkar

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3, ఎమ్4 స్పెసిఫికేషన్లు:
ఈ రెండు మోడళ్లలోను ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని 3.0 లీటర్, ఇన్-లైన్, సిక్స్-సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5500-7300 ఆర్‌పిఎమ్ వద్ద 431 బిహెచ్‌పిల శక్తిని, 1850-5500 ఆర్‌పిఎమ్ వద్ద 550 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3, ఎమ్4 మోడళ్లు కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తాయి. ఈ ఇంజన్స్ 7-స్పీడ్ ఎమ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. హై రివైవింగ్ ఎమ్ సిరీస్ ఇంజన్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన డ్రైవ్‌లాజిక్ సిస్టమ్‌ను ఈ కారులో ఆఫర్ చేస్తున్నారు.

new bmw coupe and sedan launch

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3, ఎమ్4 ఫీచర్లు:

  • ప్యాడల్ షిఫ్టర్స్ (స్టీరింగ్ వీల్‌పై)
  • లెథర్ ఫినిష్డ్ స్టీరింగ్ వీల్
  • ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్
  • బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్
  • 50:50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్
  • నెక్స్ట్ జనరేషన్ బిఎమ్‌డబ్ల్యూ ఐడ్రైవ్ విత్ టచ్ కంట్రోలర్
  • బిఎమ్‌డబ్ల్యూ నావిగేషన్ ప్రొఫెషనల్
  • బిఎమ్‌డబ్ల్యూ హెడ్-అప్ డిస్‌ప్లే విత్ ఎమ్-స్పెసిఫిక్ వ్యూస్
  • పార్క్ డిస్టన్స్ కంట్రోల్ (పిడిసి)
  • ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3, ఎమ్4 సేఫ్టీ ఫీచర్లు:

  • ఎయిర్ బ్యాగ్స్
  • యాక్టివ్ ఎమ్ డిఫరెన్షియల్
  • డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్‌సి)
  • ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
  • కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సిబిసి)
  • రన్ ఫ్లాట్ ఇండికేటర్
  • సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్

More from DriveSpark

Article Published On: Saturday, November 29, 2014, 11:00 [IST]
English summary
German automobile manufacturer BMW, has launched the much awaited performance cars from its stable, the M3 and M4 Coupe. Retired Indian cricket maestro, Sachin Tendulkar flagged off the exclusive event at the Buddh International Circuit.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+