భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపే విడుదల
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, దేశీయ విపణిలో మరో సరికొత్త విలాసవంతమైన కారును విడుదల చేసింది. 'బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపే' (BMW M6 Gran Coupe) పేరిట కంపెనీ ఓ కొత్త కారును ప్రవేశపెట్టింది.
భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపే విడుదల రూ.1.75 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఈ కారును ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు (అందుకే అంత అధిక ధర).
మరిన్ని వివరాలు ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపే స్పోర్టీ ఇంజన్‌తో ఫోర్ డోర్ కూపే రూపంలో లభ్యం కానుంది. ఈ కారులో 4.4 లీటర్ వి8 ఎమ్ ట్విన్‌పవర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 560 హెచ్‌పిల శక్తిని, 680 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎమ్6 గ్రాన్ కూపే కేవలం 4.2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు.

భారత్‌లో ఈ స్పోర్టీ లగ్జరీ కార్ కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది, ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

ఈ కారు బ్లాక్ సఫైర్, సిల్వర్‌స్టోన్, స్పేస్ గ్రే, శాన్ మారినో బ్లూ, సాకిర్ ఆరెంజ్, హావానా, సింగపూర్ గ్రే, ఇంపీరియల్ బ్లూ అనే మెటాలిక్ కలర్ ఆప్షన్లతో పాటుగా ఆల్పైన్ అనే నాన్-మెటాలిక్ కలర్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపే రూఫ్‌ను కార్బన్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ (సిఎఫ్ఆర్‌పి)తో తయారు చేశారు. ఇది తేలికగా ఉండి, ధృడమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. రెగ్యులర్ కూపే డిజైన్‌లతో పోల్చుకుంటే, ఇందులో ఇంటీరియర్ స్పేస్ మరింత మెరుగ్గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








