బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఫేస్‌లిఫ్ట్ విడుదల; ధర రూ.44.90 లక్షలు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, నేడు (ఆగస్ట్ 28, 2014) దేశీయ విపణిలో తమ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీని విడుదల చేసింది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.44.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీలో అనేక కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ట్విన్ సర్క్యులర్ హెడ్‌లైట్స్, కిడ్నీ గ్రిల్ నుంచి ప్రారంభమయ్యే రివైజ్డ్ బంపర్స్, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, సరికొత్త సైడ్ మిర్రర్స్, ఎలక్ట్రిక్ ఫంక్షనాలిటీతో కూడిన బూట్ లిడ్ వంటి మార్పులను గమనించవచ్చు. దీని ఓవరాల్ డిజైన్ అండ్ డైమన్షన్స్ అలానే ఉన్నాయి.

BMW X3 Facelift Launched

గ్లోసీ ఫినిష్‌తో కూడిన సెంటర్ కన్సోల్, రీవర్క్ చేయబడిన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, హెచ్‌విఏసి (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్), కొత్త లెథర్ సీట్స్ ఇదివరకటి కన్నా మెరుగ్గా అనిపిస్తాయి. కాస్మోటిక్ మార్పుల మినహా కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3లో మెకానికల్ (ఇంజన్ పరంగా) మార్పులు ఏమీ లేవు. ఇదివరకటి ఎక్స్‌3లో ఉపయోగించిన ఇంజన్లనే ఇందులో ఉపయోగిస్తున్నారు.

ఇది 2.0 లీటర్ మరియు 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్ ఇంజన్‌ను మరింత ఎక్కువ పవర్‌ను ఆఫర్ చేసేలా అప్‌ట్యూన్ చేశారు. ఇదివరకు 184 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఈ ఇంజన్ ఇప్పుడు 190 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాగా.. 3.0 లీటర్ ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఈ ఇంజన్లు 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటాయి.

దేశీయ విపణిలో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 వేరియంట్లు, వాటి ధరలు ఇలా ఉన్నాయి:
* బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎక్స్‌పెడిషన్ - రూ.44.90 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎక్స్‌లైన్ - రూ.49.90 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Thursday, August 28, 2014, 15:41 [IST]
English summary
German luxury carmaker BMW India has launched the new X3 facelift at starting price of INR 44.90 lakh (ex-showroom, Delhi). The new BMW X3 is locally produced at the BMW Plant Chennai in a diesel variant and is now available at BMW dealerships across India. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+