బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 స్పోర్ట్ యాక్టివిటీ కూపే కాన్సెప్ట్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మరొక సరికొత్త లగ్జరీ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ఎక్స్ సిరీస్‌లో ఎక్స్3 మరియు ఎక్స్5 మోడళ్లకు మధ్యలో ఎక్స్4ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో, 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4' స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే (ఎస్ఏసి) ఫొటోలోను కంపెనీ విడుదల చేసింది. ఆటోమొబైల్ మార్కెట్లో స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (ఎస్ఏవి) సెగ్మెంట్‌ను తొలిసారిగా బిఎమ్‌డబ్ల్యూ 1999లో పరిచయం చేసింది. (ఎస్‌యూవీ, ఎస్‌యూవీ, సెడాన్ హ్యాచ్‌బ్యాక్‌ల మాదిరిగా ఎస్ఏవి కూడా ఒక సెగ్మెంట్).
అంతేకాకుండా, ఈ ఎస్ఏవి సెగ్మెంట్లో వాహనాలను అందిస్తున్న ఏకైక కంపెనీ కూడా బిఎమ్‌డబ్ల్యూనే కావటం విశేషం. గతంలో కంపెనీ విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 మోడల్‌తో స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే (ఎస్ఏసి) అనే కొత్త సెగ్మెంట్‌ను బిఎమ్‌డబ్ల్యూ సృష్టించింది. ఇప్పుడు ఈ ఎస్ఏసి సెగ్మెంట్లో కేవలం ఎక్స్6 మాత్రమే లభిస్తుండగా, భవిష్యత్తుల్లో ఎక్స్4 కూడా లభించనుంది. ఇకపోతే, ప్రస్తుతం ఎస్ఏవి సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5 మోడళ్లను ఆఫర్ చేస్తోంది.
బిఎమ్‌డబ్ల్యూ తాజాగా ఆవిష్కరించిన ఎక్స్4 స్పోర్ట్స్ యాక్టివిటీ కూపేను ఏప్రిల్ 21 నుండి చైనాలో ప్రారంభం కానున్న షాంగై ఆటో షోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచనుంది. ఈ సరికొత్త కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను బిఎమ్‌డబ్ల్యూ ఈ ఆటో షోలో వెల్లడించనుంది. ఈలోపుగా సరికొత్త 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4' ఫొటోలను తిలకిద్దాం రండి..!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్



Click it and Unblock the Notifications








